ఉక్రెయిన్ పై దాడుల్లో భాగంగా తమకు నష్టం జరుగుతున్నా రష్యా వెనకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్ దళాలు తమ పోరాట పటిమ చూపడమే ఇందుకు కారణం. అయితే.. రష్యాపై పోరాడేందుకు జావెలిన్ క్షిపణులతోపాటు మరో 80కోట్ల విలువైన అధునాతన ఆయుధాలను అందిస్తామని అమెరికా ప్రకటించింది.
దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈమేరకు దౌత్య వర్గాల ద్వారా ఓ నోట్ పంపింది కూడా. పశ్చిమ దేశాల బాధ్యతారాహిత్యమే అని కూడా వ్యాఖ్యానించింది.
మరోవైపు.. ఉక్రెయిన్ పై రష్యా దాడులను పెంచింది. క్షిపణులు, బాంబులతో కీవ్, లివివ్, ఖర్కివ్, లుహాన్స్క్, దొనెట్స్ నగరాలతోపాటు తూర్పు ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. రష్యా తమపై అణ్వాయుధాలు, రసాయన ఆయుధాలు ఉపయోగించే అవకాశం లేకపోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని అన్నారు. పుతిన్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
597653 343048Sounds like some thing a great deal of baby boomers really should study. The feelings of neglect are there in a lot of levels when a single is more than the hill. 398094