నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ పరంగా లో ఫేజ్ లో ఉన్నాడు. ఈ ఏడాది విడుదలైన బాలయ్య సినిమాలు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు దారుణమైన పరాభవాలని చవిచూశాయి. మొదట కథానాయకుడు సంక్రాంతికి విడుదలై అట్టర్ ప్లాప్ అయితే, ఆ చిత్రాన్ని కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు అని చెప్పి మహానాయకుడు ఉచితంగా ఇచ్చేసాడు బాలయ్య. అయినా కూడా వారి లాస్ లు కవర్ అవ్వలేదు. సినిమా లాస్ అవ్వడమే కాక తన తండ్రి మీద తీసిన బయోపిక్ అలా అయిపోవడంతో బాలకృష్ణ మరింత కృంగిపోయాడు.
అయితే ఇప్పుడు బాలకృష్ణ తన తర్వాతి సినిమాతో అంతకు రెట్టింపు హిట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. తనతో జై సింహా తీసిన కెఎస్ రవికుమార్ తోనే రూలర్ చిత్రాన్ని చేసాడు. ఇందులో బాలయ్య రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఒక దాంట్లో మాస్ పోలీస్ ఆఫీసర్ గా, మరొక దాంట్లో కార్పొరేట్ కింగ్ పిన్ గా కనిపించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ నేటితో పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ 20కి రూలర్ ను విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.
మరి ఈ సినిమాతోనైనా బాలకృష్ణ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అన్నది చూడాలి. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో భూమిక కీలక పాత్రను పోషించింది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు.
