దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని మొదట అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ డేట్లు అన్నీ కన్ఫ్యూజన్ లో పడ్డాయి. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య కూడా ఇప్పుడే రిలీజ్ డేట్ గురించి ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ఆర్ ఆర్ ఆర్ గురించి క్లారిటీ రాకపోవడంతో ఇప్పుడు మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ కూడా కన్ఫ్యూజన్ లో పడ్డాయి. అక్టోబర్ 13న కర్చీఫ్ వేసుకోవడానికి కొన్ని చిత్రాలు ముందంజలో ఉన్నాయి.