Switch to English

Ustaad: ‘ఉస్తాద్’ మూవీ నుంచి ‘రోజూ నడిచిన చోటే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

Ustaad: టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ మరో కొత్త కథతో రెడీ అవుతున్నారు. ఆ చిత్ర‌మే ‘ఉస్తాద్’. శ్రీసింహా కోడూరి జతగా కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ మంగ‌ళ‌వారం ల‌వ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ లిరిక‌ల్ సాంగ్‌కు ముందు హీరో శ్రీసింహా హీరోయిన్ కావ్యా క‌ళ్యాణ్ రామ్‌తో జ‌రిపే సంభాష‌ణ ఎంతో చ‌క్క‌గా ఉంది.

ఒక‌ప్పుడు ఉత్త‌రాల‌ను తీసుకెళ్ల‌టానికి పావురాల‌ను ఉప‌యోగించేవారంట‌. కానీ ఇలా బండ్ల‌ను కూడా ఉప‌యోగిస్తార‌ని నాకు తెలియ‌దు. అస‌లు ఎంతో గొప్ప‌గా ఎక్స్‌ప్రెస్ చేశావంటూ హీరో హీరోయిన్ మ‌ధ్య సాగే సంభాష‌ణ ఆక‌ట్టుకుంటోంది. అక్క‌డి నుంచి ‘రోజూ నడిచిన చోటే.. ’ అంటూ వచ్చే సాంగ్ హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. అకీవా.బి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ‘రోజూ నడిచిన చోటే..’ సాంగ్‌ను అనంత శ్రీరామ్ పాడ‌గా అనురాగ్ కుల‌క‌ర్ణి పాడారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు మాట్లాడుతూ ‘‘ఉస్తాద్ టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. డిఫ‌రెంట్ సినిమాల‌ను కోరుకునే ఆడియెన్స్‌కు త‌ప్ప‌కుండా ఉస్తాద్ సినిమా న‌చ్చుతుంది. శ్రీసింహ, కావ్యా క‌ళ్యాణ రామ్ పెయిర్ ఆక‌ట్టుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి సిద్ధం చేస్తున్నాం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...