టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ సౌండ్ పార్టీ అంటున్నారు. టీడీపీ ని తెలుగు దొంగల పార్టీగా అభివర్ణిస్తుంటారు కొందరు. అలాగే ఆయా రాజకీయ పార్టీలపై ఇలాంటి సెటైరికల్ నిర్వచనాలు గట్టిగా పేలుతుంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి మీద కూడా బాగానే పేలాయి, పేలుతూనే వున్నాయి ఇలాంటి నయా వెటకారం నిర్వచనాలు.
ఇక, గులాబీ పార్టీపై రేవంత్ విమర్శల విషయానికొస్తే, ఐటీఐర్ విషయంలో ఐటీ మంత్రి కేటీఆర్‌కి చిత్తశుద్ధి లేదనీ, ఐటీఐఆర్ వద్దని కేటీఆర్ స్వయంగా అన్నారనీ, ఐటీఆర్ విషయంలో టీఆర్ఎస్ – బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయనీ రేవంత్ రెడ్డి సెలవిచ్చారు. లాభం వచ్చేది కాదు కాబట్టే ఐటీఆర్ గురించి కేటీఆర్ చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదన్నది రేవంత్ ఆరోపణ.
దేశంలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని రేవంత్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని రేవంత్ రెడ్డి అంటున్నారు.
518818 326106The next time I just read a weblog, I genuinely hope which it doesnt disappoint me up to this 1. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something interesting to convey. All I hear can be a handful of whining about something you could fix inside the event you werent too busy trying to uncover attention. 479794
240466 468308Hello there. I necessary to inquire some thingis this a wordpress web site as we are thinking about transferring across to WP. Moreover did you make this theme all by yourself? Cheers. 557777