Rana Daggubati: ‘నా ఆరోగ్యం గురించి ఎవరికైనా అడగాలనుంటే ముందు మీ కన్ను, కిడ్నీ దానం చేసే ఆలోచన ఉంటేనే అడగండి.. లేదంటే అవసరం లేద’న్నారు హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati). గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలో పాల్గొన్న ఆయన తన ఆరోగ్య సమస్యలపై మాట్లాడారు.
‘మనిషి చివరి దశలో ఉన్నప్పుడు జీవితం గురించి తెలుస్తుంది. తన ఆలోచనా విధానం మారిపోతుంది. నేనూ అంతే. నా అనారోగ్యం గురించి అమెరికాలో పేరున్న ఆసుపత్రికి వెళ్లినప్పుడే తెలిసింది. జీవితంపై నా ఆలోచనలు మారిపోయాయి. ఇదేనా జీవితం అనిపించింది. పరిస్థితులు.. రోజులు ఒకేలా ఉండవని అర్ధమైంది. నానుంచి ఏవో చేజారిపోతున్నట్టయింది’.
‘బాహుబలి కోసం ఎంతో బరువు పెరిగాను. అనారోగ్యం చేసి తగ్గాను. అప్పుడు ఎందరో ఎన్నో ప్రశ్నలు వేశారు. కానీ.. నేను వాటికి సమాధానం చెప్పాలనుకోలేదు. తర్వాత అరణ్య సినిమా చేశాను. ఏనుగులతో నటించాను. అక్కడ నన్ను పట్టించుకునేవారు లేరు. చుట్టూ నిశబ్దం. ప్రశాంతమైన వాతావరణం. ప్రకృతి ఎంతటి మంచి వైద్యమో తెలిసొచ్చింద’ని అన్నారు.