ఆయనకి తాతలు తండ్రులు సంపాదించిపెట్టిన అక్రమార్జన లేదు. వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం అసలే లేవు. సినిమాలు చేయాలి. కేవలం సినిమాలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ప్రధాన ఆదాయం. ఇది అందరికీ తెలిసిన విషయమే.
పనీ పాటా లేనోళ్ళు.. జనసేన అధినేత మీద ‘ప్యాకేజీ’ ఆరోపణలు చేస్తే అదో లెక్క. ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తులు కూడా, తమ స్థాయిని దిగజార్చుకుని మరీ ‘ప్యాకేజీ’ ఆరోపణలు చేస్తుంటారు. అయితే, వాస్తవమేంటో అందరికీ తెలుసు. ఆరోపణలు చేస్తున్నవాళ్ళకీ తెలుసు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు. నిజమే, జనసేన పార్టీకి ఆర్థికంగా పరిపుష్టి కలిగించేందుకు ఈ పనికి పూనుకున్నారాయన. ఇప్పటికే జనసేనాని హైద్రాబాద్‌లో ఓ ఇంటి స్థలాన్ని విక్రయించేశారనీ, అలా వచ్చిన సొమ్ముని పార్టీకి ఇప్పటికే అందజేశారనీ తెలుస్తోంది.
ఇంకో రెండు మూడు స్థలాల్ని అమ్మకానికి పెట్టగా, అవి కూడా వీలైనంత త్వరగా అమ్ముడైపోతాయనీ, ఆ నిధుల్నీ పార్టీకి అప్పగించనున్నారనీ సమాచారం. ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల ఖర్చుల నిమిత్తం, జనసేనాని పవన్ కళ్యాణ్.. తన ఆస్తుల్ని అమ్ముకోక తప్పడంలేదు.
టిక్కెట్లు ఇస్తే డబ్బులిస్తామంటూ ఫక్తు రాజకీయ నాయకులు కొందరు, జనసేన వైపు వెళుతోంటే, వారు ఇస్తోన్న చెక్కుల్ని సున్నితంగా జనసేనాని తిరస్కరిస్తున్నారు. దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువైన చెక్కుల్ని జనసేనాని ఇప్పటికే తిరస్కరించారు.
ఇదిలా వుంటే, అధికార వైసీపీకి చెందిన నేతలు గ్రామ స్థాయిలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను పిలిపించుకుని, వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు డబ్బు రూపంలో, బహుమతుల రూపంలో పంచుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.