టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీస్ మరియు నార్త్ లోనూ మంచి క్రేజ్ ఉన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దానికి కారణం దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి – ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రానున్న సినిమా కావడం. గత కొద్దీ రోజులుగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న టైంకి జరగట్లేదని, అందుకే ముందుగా అనుకున్న జూలై 30, 2020 న రిలీజ్ కాదు ఎక్కువ భాగం 2021కి వాయిదా పడుతుందనే వార్తలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి.
కానీ ఈ విషయంపై ఈ చిత్ర టీం ఇది వరకూ స్పందించలేదు. కానీ తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా వదంతుల్లో ఎలాంటి నిజం లేదు. చిత్రీకరణ ముందు అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే జరుగుతోంది. షూట్ ఎంత అయ్యింది అనేది నేను కచ్చితంగా చెప్పలేను కానీ నాదీ – తారక్ పార్ట్ సమంగా అవుతూ వస్తోంది. ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని’ ఆర్.ఆర్.ఆర్ పై క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజులా కనిపిస్తుంటే, ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. ఎంఎం కీరవాణి మ్యూసిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
914829 297300Its amazing as your other articles : D, appreciate it for putting up. 164385
412950 828464I came across this good from you out of sheer luck and never feel lucky enough to say also credit you for any job properly done. 941696