హీరో రామ్ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇన్నాళ్లు లవర్ బాయ్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ ఈ ఫొటోలో ఉన్న లుక్ చేస్తుంటే మాస్ హీరోగా మరో యాంగిల్ లో కనిపిస్తున్నాడు. అదేంటి రామ్ ఇలా మారిపోయాడు అని అనుకుంటున్నారా ? ఆయన ఇలా మారడానికి కారణం దర్శకుడు పూరి జగన్నాధ్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకోసం రామ్ తన మేక్ ఓవర్ మార్చేశాడు. టాలీవుడ్ లో ఇతర దర్శకుల సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో కానీ .. పూరి సినిమాల్లో మాత్రం హీరోలు మాస్ యాంగిల్ లో ఆదో తరహాలో ఉంటారు.
అప్పటి వరకు సాఫ్ట్ గా ఉన్న హీరో అయన సినిమాలో పూర్తీ బిన్నంగా కనిపిస్తూ తనదైన హీరోయిజంతో అదరగొడతాడు .. ఓ వైపు విలన్ లను రఫ్ఫాడిస్తు .. మరోవైపు హీరోయిన్ ను ఏమే .. వసేయ్ .. లవ్.. చెయ్యవే అంటూ నానా రచ్చ చేస్తుంటాడు . ఒక్క హీరోలో ఇంత వెరియేషనా ? అంటూ షాక్ అవుతున్నారా !! నిజమే ఇలాంటి వేరియేషన్ ఇవ్వాలంటే ఒక్క పూరి జగన్నాద్ వల్లే అవుతుంది. ఆయన సినిమాల్లో హీరో స్టయిలే వేరు !!
హీరోల హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా పూరి మ్యానరిజమ్స్ ., ఓ రేంజ్ లో ఉంటాయి .. అందుకే పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ మధ్య ఆయన పరిస్థితి ఏమి బాగాలేదు. వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న పూరి ఇప్పుడు రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమా పై అటు రామ్, ఇటు దర్శకుడు పూరి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ గా గల్లీ హీరోగా తెలంగాణ స్లాంగ్ లో హీరో రామ్ చేసే హంగామా చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
615234 897877Satisfying posting. It would appear that plenty of the stages are depending upon the originality aspect. Its a funny thing about life in case you refuse to accept anything but the top, you really often get it. by W. Somerset Maugham.. 559508
443344 769208It is really a cool and helpful piece of details. Im glad that you shared this useful information with us. Please keep us informed like this. Thanks for sharing. 225161