స్టార్ కిడ్ కాకున్నా కూడా శర్వానంద్ ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో మంచి సినిమాలు చేయడంతో పాటు నటుడిగా మంచి పేరు దక్కించుకున్న శర్వానంద్ ఈమద్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ ను చవిచూస్తున్నాడు. ఇటీవల వచ్చిన జాను చిత్రం నటుడిగా ఈయనకు మంచి మార్కులు తెచ్చి పెట్టినా కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈయన శ్రీకారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
జానుతో పాటు అంతకు ముందు ఈయన చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఆ కారణంగానే ఈయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు భయపడుతున్నారు. ఎవరో కొందరు ఆయనపై ఇష్టంతో ఆయనకే ఈ స్టోరీ సెట్ అవుతుందని వెళ్తున్నారు. వారిని కూడా శర్వానంద్ తన పారితోషికంతో భయపెడుతున్నాడట. స్టార్ హీరోల స్థాయిలో శర్వానంద్ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా శర్వానంద్ తన పారితోషికాన్ని పెంచుతూనే ఉన్నాడట. ఇటీవల ఈయన్ను ఒక నిర్మాత తమ బ్యానర్లో నటించేందుకు అడుగగా ఏకంగా ఏడు కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. అంతటి పారితోషికం శర్వా మార్కెట్కు సరైనది కాదని తన అభిప్రాయం అంటూ ఆ నిర్మాత చెప్పుకొచ్చాడు. శర్వానంద్ పారితోషికం తగ్గించుకోకుంటే కెరీర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.
689051 314737Yeah bookmaking this wasnt a speculative decision outstanding post! . 763463
475485 689420Thank you for your information and respond to you. bad credit auto loans hawaii 950901
455992 164219Yesterday, while I was at work, my sister stole my iphone and tested to see if it can survive a thirty foot drop, just so she can be a youtube sensation. My apple ipad is now destroyed and she has 83 views. I know this is entirely off topic but I had to share it with someone! 697046