Switch to English

ఉల్లి గడ్డ.. ఆలు గడ్డ.. ఎర్ర గడ్డ.! రాయలసీమని అవమానిస్తారెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఎర్ర గడ్డ.. అంటే, ఉల్లి పాయ్.. అదే ఉల్లి గడ్డ అని కొన్ని చోట్ల అంటారట.! అందులో తప్పేముంది.? కానీ, హైద్రాబాద్‌లో ఎర్రగడ్డ అంటే అదొక ప్రాంతం. అక్కడ మానసిక వైద్య శాల.. అదే, మెంటల్ హాస్పిటల్ వుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఎర్రగడ్డ’ అనగానే, మెంటల్ హాస్పిటల్ అనే అందరికీ తెలుసు. సినిమాల్లో ఈ విషయమై పడే సెటైర్ల గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఇక, ఉల్లిపాయని, ఉల్లి గడ్డ అని కూడా అంటారు. రాయలసీమలో అయితే, ‘ఉర్ల గడ్డ’ అంటారట.! రాయలసీమకి చెందిన కొందరు సోషల్ మీడియాలో, ‘ఉర్ల గడ్డ’ అంటూ ట్వీట్లేస్తున్నారు.

అసలు విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారణంగా ఈ ‘ఉల్లి గడ్డ’ పంచాయితీ తెరపైకొచ్చింది. ఇటీవల రాష్ట్రాన్ని కుదిపేసిన తుపాను నేపథ్యంలో, బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు హెలికాప్టర్ పర్యటనలు చేశారు, జనంతోనూ మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఈ క్రమంలో అధికారుల్ని వెంటేసుకుని, మీడియా ముందుకొచ్చారు. ‘కిలో ఉల్లి పాయలు, కిలో బంగాళా దుంపలు..’ ఇలా లెక్కలు చెబుతూ, బాధితులకు అందుతోన్న సహాయ సామాగ్రి గురించి పేర్కొన్నారు.

‘పొటాటో అంటే, ఉల్లి గడ్డే కదా..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతోనే అసలు తంటా వచ్చి పడింది. పొటాటో అంటే బంగాళా దుంప అనీ, ఉల్లి గడ్డ కాదనీ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనే కాదు, ఎవరైనా సరే.. మాటలో పొరపాటు జరగొచ్చు. అదేమీ నేరం కాదు కూడా.

అయితే, సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయ్యింది. దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, ‘రాయలసీమ భాష, యాసని అవమానిస్తున్నారు. రాయలసీమలో ఉల్లి గడ్డని ఉర్ల గడ్డ అనే అంటారు..’ అంటూ కొందరు నానా యాగీ చేస్తున్నారు. ఉర్ల గడ్డ, ఉల్లి గడ్డ. ఆలు గడ్డ.. ఎర్ర గడ్డ… ఈ ట్రోలింగ్ రాజకీయం ఓ మట్టి గడ్డ.!

పప్పు.. అనీ, పావలా.. అనీ రాజకీయ విమర్శలు చేసినప్పుడు, నత్తి పకోడీ అనే విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...