Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత వుందా.? లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ శూన్యత వుందా.? లేదా.? ఈ అంశంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు మీడియాలోనూ, ఇంకోపక్క ప్రజల్లోనూ జోరుగా సాగుతోంది. తెలంగాణలో రాజకీయ శూన్యత వుందనీ, అందుకే అక్కడ కొత్త పార్టీలు వస్తున్నాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నాక శూన్యత ఎక్కడ వుంటుందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.

అసలు రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని ఎలా తెలుస్తుంది.? తెలిస్తే, దాన్ని భర్తీ చేయడానికి ఎవరెలాంటి ప్రయత్నాలు చేస్తారు. నిజానికి, ప్రజా నాడిని పసిగట్టడం అంత తేలిక కాదు. అధికారంలో వున్నోళ్ళకి, ప్రజా వ్యతిరేకత అస్సలు కనిపించదు.

స్థానిక ఎన్నికల్లో అసలు విపక్షాలు పోటీ చేయకుండా ‘రక్తచరిత్ర’ సృష్టించిన అధికార వైసీపీకి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత వుందని ఎలా తెలుస్తుంది.? పైగా, ‘మాకు ఓటెయ్యకపోతే మీకు సంక్షేమ పథకాలు రావు..’ అని కీలక నేతలే స్థానిక ఎన్నికల ప్రచారంలో నినదించారాయె. ఆ ఎన్నికల్లో ఫలితాల్ని చూసుకుని, ‘వాపుని బలుపుగా’ అధికార పార్టీ భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

చంద్రబాబు హయాంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, ‘వాపుని బలుపు’గా భావించింది అప్పటి టీడీపీ సర్కారు. ఇప్పుడు వైసీపీ సర్కార్, పైన చెప్పుకున్న కొత్త విధానంలో పండగ చేసుకుంటోంది.. ప్రజా వ్యతిరేకత లేదని చెప్పుకుంటూ.

‘మాకు అమ్మవొడి వద్దు..’ అని చిన్న పిల్లలు సైతం ఛీత్కరిస్తున్న వైనం ప్రభుత్వానికి అర్థం కాకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. అధికారం అనే ‘పొర’ కంటికి కమ్మేశాక.. అలాగే వుంటుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు గుద్దించుకున్నా, ఆశించిన మెజార్టీ వైసీపీకి రాకపోవడం కూడా రాజకీయ శూన్యతలో భాగమే.

స్థానిక ఎన్నికల్లోనో, ఉప ఎన్నికల్లోనో గెలుపు వాపుని చూసి రాజకీయ బలుపు అనుకుంటే.. సార్వత్రిక ఎన్నికల నాటికి, వాపు అనే బుడగ పేలిపోతుంది. పెరుగుతున్న ధరలు, మోత మోగిపోతున్న పన్నులు.. రాజధాని లేకపోవడం.. అధికార పార్టీ నేతల బూతులు, దాడులు.. ఇవన్నీ జనం మెదళ్ళలో గట్టిగానే రిజిస్టర్ అవుతున్నాయ్.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...