Switch to English

మాకొద్దీ ప్రభుత్వం: అమరావతిలో మహిళల నినాదం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘మాకొద్దీ ప్రభుత్వం.. మేం గెలిపించుకున్న ప్రభుత్వం మమ్మల్ని చంపేస్తోంది.. రాజధాని కోసం మేం మా భూముల్ని త్యాగం చేశాం. ఇప్పుడు మా భూముల్ని తిరిగిచ్చేస్తారా.? మీకు మేమిచ్చిన అధికారాన్ని కూడా తిరిగిచ్చెయ్యండి.. మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో మహిళా లోకం నినదిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని మహిళలు తేల్చి చెబుతున్నారు.

తాజాగా ఈ రోజు అమరావతిలో మహిళా రైతులకీ, పోలీసులకీ మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తున్న తమపైకి పోలీసులు దూసుకొచ్చారనీ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ తమను పోలీస్‌ వ్యాన్లలో ఎక్కించేందుకు ప్రయత్నించారనీ, వ్యాన్‌లోకి ఎక్కించాక మెడకు చున్నీని చుట్టి గొంతు నులిమేయాలని పోలీసులు ప్రయత్నించారనీ ఓ మహిళ కన్నీరు మున్నీరయ్యింది. మరోపక్క, మహిళల్ని తరలించేందుకు సిద్ధం చేసిన వ్యాన్‌కి అడ్డంగా కొందరు వ్యక్తులు నేల మీద పడుకుంటే, ‘తొక్కించెయ్యండి.. చంపెయ్యండి..’ అని పోలీసులే అన్నారంటూ రైతులు వాపోతున్నారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి చేతి మీదకు వ్యాన్‌ ఎక్కించే ప్రయత్నం జరిగిందనీ, మరో రైతు చాకచక్యంగా ఆ వ్యక్తిని బయటకు లాగారనీ సాటి రైతులు చెబుతున్నారు. నిన్ననే వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత, ‘అమరావతిలో హత్యలు జరుగుతాయి.. వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది.. రైతులూ జాగ్రత్త..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఆ వెంటనే ఈ పరిస్థితి తలెత్తడం పట్ల రైతుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

ప్రతిపక్షాన్ని బూచిగా చూపే ప్రయత్నంలో అధికార పార్టీనే ఈ తరహా కుట్రల్ని పన్నుతోందన్నది రైతుల ఆరోపణ. కాగా, పోలీసులు ఎవర్నీ కొట్టరనీ, కించపర్చే అవకాశం కూడా లేదనీ, కేవలం శాంతి భద్రతల్ని పరిరక్షించడమే తమ లక్ష్యమనీ పోలీస్‌ ఉన్నతాధి ఒకరు ఈ ఘటనపై స్పందించారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...