OG Movie : పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నాడు.
గత రెండు మూడు రోజులుగా ఓజీ సినిమా యొక్క నిర్మాణ సంస్థ మారుతుంది అనే చర్చ జరుగుతోంది. దానయ్య చేతి నుంచి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేతికి ఓజీ సినిమా వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు దానయ్య పెట్టిన మొత్తంకు 25 శాతం అదనంగా పీపుల్స్ మీడియా వారు ఇవ్వనున్నారని కూడా ప్రచారం జరిగింది.
రెండు నిర్మాణ సంస్థలు కూడా పుకార్లకు చెక్ పెట్టాయి. పీపుల్స్ మీడియా వారు ఈ విషయమై స్పందిస్తూ తాము ఓటీ సినిమా ను టేకోవర్ చేయలేదని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా దానయ్య టీం నుంచి కూడా స్పష్టత వచ్చింది. ఓజీ సినిమాను మేమే నిర్మిస్తున్నామని ప్రకటించారు. త్వరలో ఏపీలో ఎన్నికలు ఉన్న కారణంగా పవన్ షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నాడు. ఎన్నికల తర్వాత మొదట పూర్తి చేసే సినిమా ఓజీ అంటూ సమాచారం అందుతోంది.