Switch to English

మదమెక్కిన వైసీపీని కూలదోస్తాం.. 2024లో అధికారంలోకి వస్తాం: పవన్ కల్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ‘పార్టీ నడపడానికి కావాల్సింది సిద్ధాంతం. 2014లో సూటిగా ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాడి బరిలో నిలిచాం. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం- ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుంది. నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలి. ప్రశ్నించడాన్ని తేలికగా తీసుకోవద్దు. అదే మార్పుకు శ్రీకారం. 2014లో 6గురు కార్యవర్గంతో మొదలై 76కి.. 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో మొదలై.. నేడు 3లక్షల 26వేలకు చేరుకుంది. త్వరలో 5లక్షలు కాబోతోంది. 2019 ఎన్నికల్లో 7.24 శాతం ఓట్లు.. స్థానిక ఎన్నికల్లో 27శాతం, పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు జనసేన మద్దతుతో గెలిచారు. కార్యకర్తలు నా వెంట నడవండి.. నేను నడిచి చూపిస్తా.

కూల్చివేతలతో ప్రారంభమైన పాలన..

‘నాయకులెవరైనా ‘భారతదేశం నా మతృభూమి’ అని ప్రతిజ్ఞ చేస్తే.. వైసీపీ మాత్రం.. ‘ఏపీ ప్రజలు మా బానిసలు.. వారి నడ్డి విరగ్గొడతాం.. న్యాయ వ్యవస్థను లెక్క చేయం.. రోడ్లను గుంతలమయం చేస్తాం…. ఒక్క చాన్సిస్తే 25 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తాం’ అని ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చినట్టు ఉంది. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుంది. ఒక్క ఛాన్సని ఏపీని జగన్ మంచేశారు. కొత్త ప్రభుత్వం శంకుస్థాపనలతో శుభం పలకాలి.. వైసీపీ కూల్చివేతలతో అశుభం పలికింది. ఇసుక పాలసీ లోపాలతో 32 మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసింది వైసీపీ. మూడు రాజధానుల మాట ఆ రోజెందుకు చెప్పలేదు..? మద్దతిచ్చిన టీడీపీని కూడా ప్రశ్నించింది జనసేన. ఏపీ రాజధాని ముమ్మాటికీ అమరావతే’.

మదమెక్కిన వైసీపీని కూలదోస్తాం.. 2024లో అధికారంలోకి వస్తాం: పవన్ కల్యాణ్

హామీలు ఏమయ్యాయి..?

అధికారంలోకి వస్తే 14,300 పోలీసు ఉద్యోగాలిస్తామని.. 400 ఉద్యోగాలిచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు మా నాయకుడు అవగాహన లేకుండా మాట్లాడారని అంటున్నారు. రాష్ట్రంలో అప్పులు 7లక్షల కోట్లు దాటాయి. రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయి.. కొత్తవి రావడం లేదు. మద్య నిషేధం అని చెప్పి అదే మద్యంపై కోట్లు సంపాదిస్తున్నారు. గత ప్రభుత్వ 5ఏళ్ల రికార్డుని రెండున్నరేళ్లలోనే బ్రేక్ చేశారు. వైసీపీ పాలసీలపైనే నా ద్వేషం.. పార్టీ, నేతలపై కాదు.

మదమెక్కిన వైసీపీ మహిషానికి కొమ్ములు విరగొట్టి..

బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పని చేస్తా. అధికార మదంతో కొట్టుకుంటున్న వైసీపీ మహిషానికి కొమ్ములు విరగొట్టి గద్దె దించుతాం. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తులు పెట్టుకోవాల్సి వస్తే ఎన్నికల సమయంలో ఆలోచిస్తాం’ అని అన్నారు. ఈక్రమంలో తాము అధకారంలోకి వస్తే ఏమేం చేస్తామో జనసేన అధినేత ప్రకటించారు. అమరావతిని అభ్యుదయ రాజధానిగా నిర్మిస్తాం. సచివాలయ ఉద్యోగాలను సులభ్ కాంప్లెక్స్ ఉద్యోగాలుగా కాకుండా చూస్తాం. ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం నుంచి 10లక్షలు అందిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం. సీపీఎస్ రద్దు చేస్తాం’ అని అన్నారు.

మదమెక్కిన వైసీపీని కూలదోస్తాం.. 2024లో అధికారంలోకి వస్తాం: పవన్ కల్యాణ్

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...