Pawan Kalyan: పవన్ కల్యాణ్ (Pawan Kalya) అభిమానులతోపాటు ట్రేడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఓజీ’ (OG). ముంబయి-జపాన్ నేపథ్యంలో జరిగే మాఫియా కథతో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో పవన్ లుక్స్, స్టయిల్, నేపథ్యం సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాయి. ఇప్పుడు సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన అప్డేట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
‘ఓజీ కథానుసారం పవన్ కల్యాణ్ తో పాట పాడించే సందర్భం ఉంది. కాబట్టి.. ఆయనతో పాడించాలని భావిస్తున్నాం. ప్రస్తుతం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నా’మని అన్నారు. దీంతో పవన్ అభిమానుల్లో జోష్ నెలకొంది. ఇప్పటికే కెరీర్లో ఎన్నో సినిమాల్లో పాటలు, బీట్ సాంగ్స్ పాడిన పవన్ కల్యాణ్ మరోసారి పాట పాడితే వినొచ్చని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకుంది ఓజీ. ఓజీలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.