Switch to English

ఆ ఇద్ద‌రిపై ప‌వ‌న్ మాట‌ల యుద్ధం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఎన్నిక‌ల స‌భ‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాటల తూటాల‌ను పేలుస్తున్నారు. అటు చంద్ర‌బాబును, ఇటు జ‌గ‌న్‌పై వాక్బాణాలు కురిపిస్తున్నారు. మ‌చ్చుకు కొన్ని ఇక్క‌డ ఇస్తున్నాం.

‘నేను ఎవరితో మాట్లాడినా వారి భాగస్వామి అంటున్నారు. జగన్‌ అమిత్‌షాలే భాగస్వాములు. రాయలసీమలో అడుగు పెట్టకుండా చేసేందుకు అనేక కుట్రలు పన్నారు. నాకు ఇవాళ హెలికాప్టర్‌ అనుమతి రద్దు చేశారు. ఎందుకని ప్రశ్నిస్తే దిల్లీ నుంచి ఆదేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి డైరెక్షన్‌ ఎవరు ఇస్తున్నారు. జగన్‌ ఇచ్చారా?.. బిజెపి వాళ్లు ఇచ్చారా.. జగన్‌లా నేను డొంక తిరుగుడుగా చేయను. దొంగయవ్వారాలు చేయను’ అని జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కడప సభలో విరుచుకుపడ్డారు.

ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె, అనంతపురం, ధర్మవరం, కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ‘వైసిపి నాయకుల మీద నాకు వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. ఇన్ని కేసులు పెట్టుకొని రేపు కేంద్ర ప్రభుత్వం మళ్లీ వాటిని తోడితే రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తారన్నదే నా బాధ’ అని పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా జగన్‌నుద్దేశించి అన్నారు.

వైసిపిని ఎదుర్కోవడం జనసైనికుల వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. ‘నేను రెండుసార్లు కేసీఆర్‌ను కలిస్తే టిఆర్ ఎస్‌ భాగస్వామినని టిడిపి విమర్శించింది. జగనేమో నన్ను టిడిపి భాగస్వామి అంటున్నారు. నిజానికి జగనే.. బిజెపి, టిఆర్ ఎస్‌ల‌కు భాగస్వామి. నాకు టిడిపి జతకట్టాలని ఉంటే.. చెప్పి చేస్తాను. 2014లోనూ బహిరంగంగా చెప్పి చేశాను. మీలాగా దిల్లీకి వెళ్లి అమిత్‌ షా, మోదీ కాళ్లు పట్టుకోను. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను.

నేను జగన్‌లాగా సీఎం కొడుకును కాదు. చంద్రబాబు లాగా సీఎం అల్లుడిని కాదు. నాకు ఎన్ని సీట్లు వస్తాయో తెలీదు. మీరు ఆమోదిస్తే సీఎంను అవుతాను. నేను ఆడపడుచులు, అన్నదమ్ముల పక్షం. నెల్లూరు సభలో కొందరు నన్ను ఫ్యాను రెక్కలు విరవాలని అడిగారు. ఆ అవసరం లేదు. అందుకు అవసరమైన ఫ్యాన్స్‌(అభిమానులు) నా దగ్గర ఉన్నారు. మనకున్న పవర్‌ రానున్న రోజుల్లో అమరావతిపై జనసేన జెండాను రెపరెపలాడిస్తుంది.

జగన్‌ ఇన్నాళ్లు అసెంబ్లీకి వెళ్లకుండా.. ప్రతిసారి ముఖ్యమంత్రినైతేనే చేస్తానని చెప్పడం సబబు కాదు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు తీర్చాలి. సైకిల్‌ పాతబడిపోయింది. కేసీఆర్‌ సైకిల్‌ చైన్‌ తెంచేశారు. చంద్రబాబు అతుకులు వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. ‘ఎండలో వచ్చాం.. ఫ్యాను వేద్దాం’ అనుకుంటే ఫ్యాను తిరగట్లేదు. అందుకు అవసరమైన పవర్‌ మన దగ్గర ఉంది. ఇద్దరికీ ఒక గ్లాసులో చల్లని నీళ్లు, మజ్జిగ ఇచ్చి సేదదీరుద్దాం. జగన్‌, చంద్రబాబులు ఇద్దరూ జనసేనకు ఓటు వేయాల్సిందే.

60 ఏళ్లు దాటిన రైతులకు రూ.5వేలు పింఛను ఇస్తాం. కుటుంబాన్ని బట్టి ఏడాదికి 10 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. రేషన్‌ సరకులకు బదులు.. ఆయా కుటుంబ సభ్యుల సంఖ్యను అనుసరించి రూ.2500 నుంచి రూ.3వేలు నగదు అందిస్తాం. ఉద్యోగుల సీసీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాం’ అని పవన్‌ తెలిపారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.....