Switch to English

గబ్బర్ సింగ్, సాంబ.. మళ్లీ కలిసి కనిపిస్తారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రూపాయీ.. రూపాయీ.. నువ్వు ఏం చేస్తావని అడిగితే.. అన్నదమ్ముల మధ్య కొట్లాట పెడతాను, తండ్రీకొడుకులకు విడదీస్తాను, ప్రాణ స్నేహితులను సైతం వేరుచేస్తాను, మొగుడూ పెళ్లాల మధ్య చిచ్చు పెడతాను అని అందట. డబ్బే కాదు.. రాజకీయాలు సైతం ఈ పని చేస్తున్నాయి. ఒకప్పుడు కలిసి ఉన్నవారు విడిపోతున్నారు. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, హాస్యనటుడు అలీ వ్యవహారం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. తొలినుంచి ఎంతో స్నేహంగా ఉండే వీరి మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. అలీ నన్ను మోసం చేశాడని పవన్ ఆవేదన వ్యక్తంచేయగా.. అలీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అలీకి తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో వెల్లడించారు.

అలీ చాలా మంచి వ్యక్తి అని, ఎంతోమందిని తన సొంత డబ్బుతో ఆదుకుంటున్న ఆయనంటే తనకు చాలా గౌరవం అని, అలీ లేకుండా తన సినిమా ఉండదని పలుమార్లు స్పష్టంచేశారు. పవన్ చెప్పినట్టే ఆయన ప్రతి సినిమాలోనూ అలీ ఉండేలా చూసుకునేవారు. తనకున్న కొద్దిమంది స్నేహితుల్లో అలీ ఒక్కరని చెప్పిన పవన్.. ఆయనకు చాలా విలువ ఇచ్చేవారు. అలీ కూడా పవన్ పట్ల అలాగే వ్యవహరించేవారు. అరె సాంబా రాసుకోరా.. అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్, అలీల మధ్య ఉండే సన్నివేశాలు సినీ ప్రేమికులు ఎంతగానో ఆశ్వాదించారు. అలాంటి మంచి స్నేహితుల మధ్య తాజా రాజకీయాలు చిచ్చు పెట్టాయి. సోమవారం రాజమండ్రిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ.. అలీ తనను మోసం చేసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు.

కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నానని, కానీ తనకు అవసరం అయినప్పుడు అలీ తన స్వార్థం చూసుకుని మరో పార్టీలో చేరాడని ఆరోపించారు. మరో పార్టీలో చేరడడం తప్పు కాదని, కానీ అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు తనతో కలిసి పనిచేస్తానని చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. అలీ వంటివారే వదిలేసి వెళ్లిపోతే ఇంకెవరిని నమ్మాలన్నారు. అందుకే ఇలాంటి వారిని నమ్మడం కన్నా సమాజాన్ని నమ్మడం మంచిదని అభిప్రాయపడ్డారు. అలీని వైఎస్సార్ సీపీ నేతలు వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అలీ ఘాటుగా స్పందించారు. వైఎస్సార్ సీపీలో చేరడం ఏమైనా నేరమా? అదేమైనా రాజ్యాంగ విరుద్ధమా అని ప్రశ్నించారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నా అంటున్నారు.. నాకు డబ్బేమైనా ఇచ్చారా? లేక సినిమా అవకాశాలు ఇప్పించారా అని నిలదీశారు.

చిరంజీవి వేసిన బాటలో పవన్ కల్యాణ్ వచ్చారని, తనకు మాత్రం ఎలాంటి సపోర్ట్ లేదని పేర్కొన్నారు. పవన్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికే తాను మంచి పోజిషన్లో ఉన్నానని చెప్పారు. పవన్ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వరుసలో మొదటి వ్యక్తిని తానేనని, కానీ తన గురించి పవన్ అలా మాట్లాడడం బాధేసిందని అలీ వ్యాఖ్యానించారు. పవన్ స్థానం తన గుండెల్లో ఉంటుందని చెబుతూనే అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వాస్తవానికి అలీ రాజకీయాల్లోకి వచ్చేముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వరుస సమావేశాలు జరిపారు. చివరకు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో ఇప్పటివరకు పవన్, అలీలు పరస్పరం విమర్శించుకోలేదు.

అయితే, రాజమండ్రిలో అలీపై పవన్ విమర్శలు చేయడం.. అందుకు ప్రతిగా అలీ తీవ్రంగా స్పందించడంతో ఇరువురి మధ్య స్నేహానికి బీటలు ఏర్పడ్డాయి. వాస్తవానికి పవన్ కల్యాణ్.. అలీని తీవ్రంగా ఏమీ విమర్శించలేదు. ఎంతో నమ్మిన అలీ తనకు అవసరమైన సమయంలో అండగా లేకుండా వెళ్లిపోయాడంటూ తన ఆవేదన వెలిబుచ్చారు. దీనికి అలీ ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్నట్టు.. పవన్ చేసిన వ్యాఖ్యలకు అలీ హుందాగా స్పందించి ఉంటే సరిపోయేదని, వైఎస్సార్ సీపీ విధానాలు నచ్చడం వల్లే తాను ఆ పార్టీలోకి వెళ్లాననే తరహాలో సమాధానం చెప్పి ఉంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదని అంటున్నారు. రాజకీయాల కోసం ఎన్నో ఏళ్ల నాటి స్నేహం దూరం చేసుకోవడం సబబు కాదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించినా.. ఇరువురూ కలిసి మళ్లీ కనిపిస్తారా అనేది సందేహమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...