Switch to English

వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి మార్చి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. GA2 పిక్చర్స్ లో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, ఎమ్.విజయ్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 4న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ..

శిరీష్ గారు, అను వాళ్లద్దరి వలన ఈ సినిమా షూటింగ్ చాలా స్మూత్ గా జరిగింది. శిరీష్ గారికి ఈ సినిమాలో ఉన్న కేరక్టర్ కి చాలా దూరం. శిరీష్ కి ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే శిరీష్ గారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. శ్రీ కుమార్ అనే కేరక్టర్ పర్ఫెక్ట్ గా అర్ధం చేసుకుని ప్రెజెంట్ చేసారు.

అను చెప్పిన టైమ్ కు సెట్ వస్తుంది. ఈ టైటిల్ ఊర్వశివో.. రాక్షసివో కానీ, రియల్ లైఫ్ ఊర్వశిని అందరు అప్రీసెట్ చేస్తారు.అరవింద్ గారు నాకు ప్రతి విషయంలోను ఫ్రీడమ్ ఇచ్చారన్నారు.

అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..

ఇంత కంఫర్ట్ తో నేను ఏ సినిమా చెయ్యలేదు, ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్, నా పేరు ఎప్పుడు సినిమా పోస్టర్ లో చూడలేదు, కానీ నేను ఈరోజు హీరోతో పాటు చూస్తున్నాను. అది చాలా ఆనందంగా ఉంది. బన్నీ వాసు గారికి థాంక్యూ ఆయనే ఈ సినిమా కోసం నన్ను కలిసారు. టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్యూ. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అన్నారు.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ

బాలయ్య గారు పిలిచిన వెంటనే ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా సింపుల్ ఆటిట్యూడ్ తో ఉంటారు. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం కంటే, ఈ సినిమా సక్సెస్ అయ్యాక మాట్లాడతా. ఇక్కడికి వచ్చిన యంగ్ డైరెక్టర్స్ అందరికి నా కృతజ్ఞతలు.

రాకేష్ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించావ్ థాంక్యూ. ఈ సినిమాకి బాక్గ్రౌండ్ లో బన్నీవాసు ఎంతో పనిచేసారు. అతను నా కొడుకు లాంటివాడు చిన్నగా థాంక్స్ చెప్తే బాగోదు. శిరీష్ గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాడిని, మధ్యతరగతి వాడిలా చూపించి ఒప్పించాడు దర్శకుడు. ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ తప్పకుండా చూడండి అన్నారు.

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ…

ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికి చాలా థాంక్యూ. డైరెక్టర్ రాకేష్ గారితో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసాక మీకు అర్ధమవుతుంది ఈ సినిమా ఎంత బాగా తీసారని.

అలానే సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కి, నటులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి. నేను మా నాన్నతో కలిసి చేస్తున్న 3వ సినిమా ఇది. హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ గురించి మాట్లాడుతూ, నాకు ఈ సినిమా హిట్ అవ్వాలని ఎంతలా కోరుకుంటున్నానో, అను కి కూడా అంతే హిట్ అవ్వాలనుకుంటున్నాను. బాలయ్య బాబు గారి ఏజ్ నాకు తెలియదు కానీ ఆయన ఎనర్జీ మాత్రం పాతికేళ్ల కుర్రాడిలా ఉంటారు. బాలయ్య బాబుగారు నా సినిమా ఫంక్షన్ కి ఎప్పుడు నుండో పిలుద్దామనుకున్నాను, కానీ నో అంటారు అని భయపడ్డాను. అన్ స్టాపబుల్ చుశాక ఏదైతే అది అయిందని పిలిచాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు అన్నారు.

ముఖ్య అతిధి నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ..

ఇక్కడికి విచ్చేసిన నందమూరి, అల్లు అభిమానులకి కళా భివందనాలు.ఇక్కడున్న డైరెక్టర్స్ అంతా మంచి సినిమాలు తిస్తూ కొత్త ఒరవడి సృష్టించారు. అరవింద్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. అరవింద్ గారు మేము అంతా ఒక కుటుంబ సభ్యులం. మంచి సినిమాలు చేస్తూ గీతా ఆర్ట్స్ ను ఈ స్థాయికి తీసుకెళ్ళారు అరవింద్ గారు అంటూ స్వర్గీయ అల్లు రామలింగయ్యగారి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. శిరీష్ ను నా షోకి గెస్ట్ గా పిలిపించి అన్ని విషయాలు కూపీ లాగుదాం. ఊర్వశివో.. రాక్షసివో చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా విడుదలై మీ ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర దర్శకుడు రాకేష్ శశి కి , మ్యూజిక్ డైరెక్టర్ కి అచ్చు రాజమణి కి, అనూప్ గారికి అభినందనలు తెలిపారు. కలర్ ఫుల్ గా ఉంది పిక్చర్, మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ అన్నం, వస్త్రాలు అవసరాలతో పాటు సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. కాబట్టి ప్రేక్షకులకు ఎటువంటి సినిమాలు అందించాలి అనేది ఆలోచించాల్సిన విషయం. యాక్టింగ్ అనేది అరవడం, నవ్వడం ,ఏడవడం కాదు యాక్టింగ్ అనేది పరకాయ ప్రవేశం. ఈ పిక్చర్ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి మార్చి నవంబర్ 4 కు మార్చాలి.

అను ఇమ్మాన్యూల్ అందంతో పాటు తన హావభావాలు కూడా సమపాళ్లలో కనిపించాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...