చిరంజీవి సినిమా అంటే క్రేజ్ ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. ఈ విషయాన్ని తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 నిరూపించింది. మాస్ కధాంశాలతో మెగాస్టార్ క్రేజ్ తెచ్చుకున్న చిరంజీవి కెరీర్లో కొన్ని క్లాస్ సినిమాలూ చేశారు. ఆయితే.. చారిత్రక కథాంశంతో సినిమా చేయలేదు. ఆ వెలితిన చిరంజీవికి తీర్చిన సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’. భారతదేశపు తొలి స్వాతంత్ర సమరయోధుడి కథతో 250 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. నేటితో ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది.
ఈ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపమే ప్రదర్శించారు. యాక్షన్, కళ్లతో అభినయం, భారీ డైలాగులతో చిరంజీవి వన్ మ్యాన్ షో చేశారు. క్లైమాక్స్ లో నరసింహారెడ్డి పాత్రలోకి చిరంజీవి పరకాయ ప్రవేశమే చేశారు. ఆ సన్నివేశంలో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసి కన్నీళ్లు తెప్పించారంటే అతిశయోక్తి కాదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాలో కీలకపాత్ర పోషించి ప్రత్యేకంగా నిలిచారు. దర్శకుడిగా సురేందర్ రెడ్డి పనితనం, తన కష్టం ఈ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రేక్షకుల్ని ఆ కాలానికి వెళ్లిన అనుభూతి తీసుకొచ్చారు.
పరుచూరి బ్రదర్స్ కథ, బుర్రా సాయిమాధవ్ మాటలు సినిమాకు బలం. అమిత్ త్రివేది సంగీతం, జులియస్ ప్యాక్ మెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతగా రామ్ చరణ్ ఈ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కించారు. చిరంజీవి మళ్లీ సినిమాలు చేసిన తర్వాత వరుసగా ఖైదీ నెం.150, సైరా.. రెండు సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్ల మార్కు దాటాయి. యూఎస్ లో వరుసగా 2మిలియన్ల కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద చిరంజీవి స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరపించారు.
A film that will remain the most special for many reasons! 🧡🔥
1 year for #SyeRaaNarasimhaReddy!@SrBachchan @KChiruTweets @DirSurender #Nayanthara @KicchaSudeep @VijaySethuOffl @IamJagguBhai @ravikishann @tamannaahspeaks @KonidelaPro #SyeRaa
— Konidela Pro Company (@KonidelaPro) October 2, 2020
336435 488232I actually thankful to uncover this website on bing, just what I was seeking for : D too bookmarked . 632242
370343 366990Hi there for your personal broad critique, then again particularly passionate the recent Zune, and furthermore intend this specific, not to mention the beneficial feedbacks other sorts of everyone has posted, will determine if is it doesnt answer youre seeking for. 357264
451152 772750just couldnt leave your web web site before suggesting that I truly loved the normal info a person provide for your visitors? Is gonna be once more ceaselessly to check up on new posts 337884