‘సైరా’ కోసం ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,401FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ కూడా ఒకటి. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ని ఓ రేంజ్‌లో ప్రమోట్‌ చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి ఎవరూ ఊహించని అతిథులు హాజరు కాబోతున్నారట.

ఆ లిస్ట్‌లో ప్రభాస్‌, మహేష్‌తోపాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు కూడా విన్పిస్తోంది. నాగార్జున, వెంకటేష్‌ పేర్లు కూడా చర్చకు వస్తున్నాయని సమాచారమ్‌. మెగా కాంపౌండ్‌ నుంచి దాదాపు అందరూ ఈ ఈవెంట్‌కి హాజరు కాబోతున్నారట. ‘సైరా నరసింహారెడ్డి’ని ఓ కమర్షియల్‌ సినిమాలా మాత్రమే కాకుండా, దీన్నొక ‘పాన్‌ ఇండియా’ ఫిలిం, పేట్రియాటిక్‌ ఫిలిం.. అనే కోణంలోనే అంతా భావించేలా ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారమ్‌.

ఇదిలా వుంటే, మహేష్‌తోపాటు ఎన్టీఆర్‌, ప్రభాస్‌లతో ఇప్పటికే నిర్మాత రామ్‌చరణ్‌ సంప్రదింపులు షురూ చేశాడనీ, ఆ ముగ్గురూ ఓకే చెప్పారనీ సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. మరోపక్క, చిరంజీవి – మహేష్‌ మధ్య తాజాగా ఈ సినిమా గురించి చర్చ జరిగిందట. సినీ మహోత్సవం పేరుతో జరిగిన ఈవెంట్‌లో చిరంజీవి – మహేష్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా చాలా విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్‌ చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ గురించి చిరంజీవి అడిగి తెలుసుకున్నారనీ, ‘సైరా నరసింహారెడ్డి’ విషయమై మహేష్‌, చిరంజీవిని అడిగి తెలుసుకున్నాడనీ అంటున్నారు.

Also Read: వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. ఎప్పుడంటే.!

చిరంజీవి అంటే మహేష్‌కి మొదటి నుంచీ గౌరవం వుందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. చిరంజీవి – ప్రభాస్‌ సంగతి సరే సరి. ఎన్టీఆర్‌ – చిరంజీవి గతంలో ఓ కార్యక్రమంలో కలివారు.. ‘మమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేస్తూనే వుండాలి మీరు..’ అంటూ ఎన్టీఆర్‌, చిరంజీవిని కోరాడు కూడా. అయితే, ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎవరు కన్పిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఎందుకంటే, ఆ టైమ్‌కి ఎవరు అందుబాటులో వుంటారన్నది ఇప్పుడే చెప్పలేం.

9 COMMENTS

సినిమా

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

‘లెనిన్’ జోరు.. మూడు రోజుల్లో రూ.61 కోట్ల వసూళ్లు!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా...

Johnny Master: శేఖర్ మాస్టర్ తో గొడవ..! జానీ మాస్టర్ ఇచ్చిన...

Johnny Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ డాన్స్ అసోసియేషన్ హాల్ లో పోలీసుల సమక్షంలోనే వాదులాడుకున్న వీడియో వైరల్ కావడం తెలిసిందే....

Jr.Ntr: రాష్ట్ర రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ..! అభిమానుల సంఘం స్పష్టత

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్, రాజకీయవర్గాలు, ఇండస్ట్రీలోనూ ఆసక్తి...

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ ఫైనల్‌ టచ్‌.. అమెరికాలో స్క్రిప్ట్‌...

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక సినిమా గురించి ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ దాదాపు ఖరారైందని,...

రాజకీయం

తెలంగాణలో జనసేన ఫోకస్.. 17 లోక్‌సభ స్థానాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, గ్రామస్థాయి వరకు కార్యకర్తలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ...

చింతూరు అడవుల్లో డ్రోన్లతో సీడ్ బాల్స్.. ఏపీలో తొలిసారి!

ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా అటవీశాఖ మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్...

ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, పవన్...

సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాదం కేసు.. సీసీటీవీతో వెలుగులోకి కొత్త నిజాలు?

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు నమోదైన కేసుపై పలు ప్రశ్నలు...

శస్త్రచికిత్స విజయవంతం.. త్వరలోనే ప్రజా సేవలోకి తిరిగి వస్తారు: పవన్ ఆరోగ్యంపై చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం...

ఎక్కువ చదివినవి

‘అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం’.. ‘ఓ.! సుకుమారి’పై నిర్మాత మహేశ్వర్ రెడ్డి

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ కుటుంబ కథా చిత్రం 'ఓ.! సుకుమారి' జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

Daily Horoscope: సింహరాశికి ఉద్యోగంలో శుభవార్త.. కుంభరాశికి ఆర్థిక నిర్ణయాల్లో అప్రమత్తత అవసరం

జులై 13 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు చంద్రಮಾನ పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్త వహించడం మంచిది....

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

“అఖిల్ విజయానికి నాగార్జున చేసిన కష్టమే కారణం”.. భావోద్వేగమైన శివాజీ

'లెనిన్' బ్లాక్‌బస్టర్ విజయోత్సవ వేడుకల్లో నటుడు శివాజీ చేసిన ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పిన ఆయన, అక్కినేని కుటుంబానికి...