యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టి స్టారర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ క్రేజీని పెంచింది. బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత రాజమౌళి దాన్ని మించిన బడ్జెట్ తో ఈ సినిమా చేస్తుండడంతో సినీ వర్గాల్లో సంచలనం గా మారింది. ఈ సినిమా కోసం ఏకంగా ఏడాది టైం ను కేటాయించారు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు. అంటే వచ్చే ఏడాది 2020- జులై వరకు ఎన్టీఆర్ సినిమా ఏది రాదు. అయితే ఈ మధ్యలో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషిస్తున్న ఓ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ కు ఓకే చెప్పాడు.
రాజమౌళి సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న విషయం ఇప్పటికే ఫిలిం వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా అయన అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నారు. అయితే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ .. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా దాదాపు ఖరారైనట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అయన నెక్స్ట్ సినిమా కొరటాల శివ తో ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా గురించి వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. ఎన్టీఆర్ తో జనతా గ్యారెజ్ లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల శివ మరోసారి ఎన్టీఆర్ తో సినిమాకు ఆసక్తి చూపించాడు.
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా మెగాస్టార్ పుట్టినరోజు అంటే ఆగస్టు 22న ప్రారంభం అవుతుందట. దాని సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ ఇటు మెగాస్టార్ సినిమా పూర్తీ చేసేలోగా .. అటు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ పూర్తీ చేస్తాడు .. ఆ తరువాత ఇద్దరు కలిసి చేసే సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.