సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉద్దేశ్యం ఏదైనా, పవన్ కళ్యాణ్ గుబురు గెడ్డంతో కన్పిస్తోంటే, తట్టుకోవడం అభిమానులకే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి కొత్త గెటప్ ఏదన్నా కన్పిస్తే, అది క్లీన్ షేవ్‌తో కన్పిస్తే.. అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా వుంటోంది.
అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం గెటప్ మార్చడంలేదు. ‘కొత్త గెటప్’ అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పాత ఫొటోలు, మార్ఫింగ్ ఫొటోలు మాత్రమే హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ కొత్త ఫొటో సోషల్ మీడియాలో కన్పించేసరికి, అభిమానులు షరారామూలుగానే దాన్ని వైరల్ చేసి పారేశారు. చెక్స్ షర్ట్‌లో స్టైలిష్‌గా పవన్ కళ్యాణ్ కన్పిస్తున్నాడు. అయితే, గుబురు గడ్డం ప్లేస్‌లో లైట్ షేవ్‌లో కన్పించి అభిమానులకు బోల్డంత ఆనందాన్ని పంచుతున్నారాయన. ఇది నిజమైన ఫొటోయేనా.? అన్నదానిపై చాలా చర్చ జరుగుతోంది.
ఎన్నికల సమయంలోనే ఇలాంటి గెటప్‌తో పవన్ కన్పించి వుంటే, డైనమిక్ లీడర్ అన్న భావన కలిగేదనీ, పంచె కట్టులో పవన్ హల్‌చల్ చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారనీ.. ఇప్పటికీ విశ్లేషణలు చూస్తూనే వున్నాం. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ త్వరలో అమెరికా వెళ్ళబోతున్నారు ‘తానా’ సభల కోసం. ఈ నేపథ్యంలోనే పవన్ గెటప్ మార్చి వుండొచ్చన్నది కొందరి అభిప్రాయం.
కాగా, పవన్ కళ్యాణ్ ఎలాగూ రేపో మాపో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొనబోతున్నారు గనుక.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫొటోపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్కటి మాత్రం నిజం.. పవన్ కళ్యాణ్ అంటే పవర్ అండ్ స్టైల్. ప్రత్యేకించి ఆయన స్టైలింగ్ చేయాల్సిన పనిలేదు. అలాగని, గుబురు గడ్డంలో ‘బాబా’ గెటప్‌లో మాత్రం ఆయన్ని అభిమానులే కాదు, సామాన్యులూ చూడలేకపోతున్న పరిస్థితి. పార్టీ నేతలు సైతం పవన్‌ని ఈ విషయంలో ఒప్పించలేకపోయారా.? అంటే, ‘అవును’ అనే సమాధానం వస్తోంది పార్టీ వర్గాల నుంచి. గెటప్ మార్చి, జనంలోకి వెళ్ళి.. డైనమిక్ లీడర్ అన్న నమ్మకాన్ని పొందితే.. రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగలరు.