రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. సినిమా ప్రారంభం నుండే అందరిలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా రోజు రోజుకు విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే మూడు సార్లు విడుదల డేట్ మార్చారు. ఈ సినిమా విషయంలో ఇంకా షూటింగ్ మిగిలే ఉందంటూ అందుకే విడుదల డేట్ మార్చాల్సి వస్తుందంటూ నిర్మాతలు చెబుతున్నారు. నిజానికి మే 1న విడుదల కావాల్సిన సినిమా మే 28, జూన్ ఇలా డేట్స్ మారుతూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ఏమి జరుగుతుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న.
నిజానికి ఈ సినిమా విషయంలో హీరోకి దర్శకుడికి మధ్య విభేదాలే కారణమని తెలుస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో హీరో విజయ్ దేవరకొండ అన్ని విషయాల్లో వేలు పెడుతున్నాడని దర్శకుడు కంప్లైంట్ చేస్తున్నాడట. గీతగోవిందం విషయంలో విజయ్ చెప్పిన జడ్జెమెంట్ వల్ల ఆ సినిమా పెద్ద విజయం అందుకుందని, అందుకే ఈ సినిమా విషయంలో అలా చేయి, ఇలా చేయి అంటూ విజయ్ ఇంటర్ఫియర్ అవుతుండడంతో దర్శకుడు అసహనంగా ఫీల్ అవుతున్నాడట.
ఒక సందర్భంలో ఈ సినిమా నుండి దర్శకుడు తప్పుకోవాలని అనుకున్నాడట. కానీ ఇచ్చిన కమిట్మెంట్ కోసం ఆగాడని అంటున్నారు. మొత్తానికి హీరో, దర్శకుల వ్యవహారంతో మైత్రి మూవీస్ నిర్మాతలకు టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం వర్గాల్లో హల్చల్ అవుతుంది. ఈ విషయంలో నిర్మాతలు దర్శకుడిని బిజ్జగించారని, దాంతో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాడని టాక్. అటు విజయ్ దేవరకొండకు కూడా నిర్మాతలు సలహాలు ఇచ్చారట. మరి ఇప్పుడైనా ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగి .. అనుకున్నట్టుగా జులై 26న విడుదల చేస్తారో లేదో చూడాలి.