Switch to English

నిమ్మగడ్డ ఎపిసోడ్‌: ఏపీ సర్కార్‌కి మరో ఝలక్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చేసిన తప్పు.. మళ్ళీ మళ్ళీ చేస్తే ఎలా.? అని జనం విస్తుపోతున్నా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలు తీరు మార్చుకోవడంలేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన అప్పటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘కులం ముద్ర’ వేసి తొలగించిన విషయం విదితమే. ‘ఎన్నికల సంస్కరణలు’ అంటూ ప్రభుత్వం ‘కవరింగ్‌’ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా, అంతకు ముందే సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, నిమ్మగడ్డపై ‘కులం’ పేరుతో వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

ఇక, ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై పదే పదే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నాయి. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు పడ్డా.. ప్రభుత్వ తీరు మారడంలేదు. తాజాగా, హైకోర్టు మరోమారు మొట్టికాయలేసింది. సుప్రీంకోర్టు, నిమ్మగడ్డ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించిన దరిమిలా, తాము ఇచ్చిన తీర్పుని అమలు చేయాలి కదా.? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆరోపిస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరోమారు హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. విచారణను వచ్చేవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, గవర్నర్‌ని కలిసి తనను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా అపాయింట్‌ చేయాలని కోరాలంటూ ఆదేశించింది. దాంతో, నిమ్మగడ్డ వీలైనంత త్వరగా గవర్నర్‌ని కలిసేందుకు మార్గం సుగమం అయ్యింది.

అయితే, గవర్నర్‌.. నిమ్మగడ్డను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తారా.? లేదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఒకవేళ నిమ్మగడ్డను గవర్నర్‌ ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందుకు ఒప్పుకుంటారా.? లేదా.? అన్నది ఇంకో చర్చ. అన్నట్టు, ఇటీవల నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, బీజేపీ నేత సుజనా చౌదరిని హైద్రాబాద్‌లో ఓ హోటల్‌లో కలవడం పట్ల వైసీపీ నానా యాగీ చేసిన విషయం విదితమే. ‘ఈ ఘటనలో మరిన్ని సంచలన అంశాలు వెలుగు చూడనున్నాయి..’ అంటూ అప్పట్లో వైసీపీ పెద్దలు బిల్డప్‌ ఇచ్చారు. కానీ, చిత్రంగా ఆ వివాదం తేలిగ్గానే చల్లారిపోయింది. తాజాగా నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ప్రభుత్వానికి చుక్కెదురయిన నేపథ్యంలో.. మళ్ళీ ఆనాటి ఆ ‘హోటల్‌’ ఎపిసోడ్‌పై మళ్ళీ వైసీపీ యాగీ షురూ అవుతుందేమో వేచి చూడాలి.!

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...