Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్లో చాలా కాలం నుండే ఉన్నా, అనుకున్న స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేకపోయింది. అమ్మడు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయడమే దీనికి కారణంగా చెప్పాలి. మిగతా హీరోయిన్లతో పోల్చితే నిధి అగర్వాల్ చాలా తక్కువ సినిమాలు చేసింది. తనదైన క్యూట్ లుక్స్‌తో పాటు అందాల ఆరబోతలోనూ ఈ బ్యూటీ మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది.
ఇక యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న నిధి అగర్వాల్, ఆ తరువాత కూడా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆ సినిమాలో అమ్మడు చేసిన గ్లామర్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ బ్యూటీని మళ్లీ థియేటర్లలో అందాలను పరుస్తూ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది నిధి అగర్వాల్.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, హాట్ ఫోటోలను నిత్యం షేర్ చేస్తోంది ఈ చిన్నది. అందాల నిధిని చూసి ఆమె అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా టైట్ ఫిట్ డ్రేస్‌లో ఎద అందాలతో అభిమానులకు మత్తెక్కిస్తోంది. ఇంతటి హాట్‌నెస్‌ను చూసి అభిమానులు ఆమె ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరి ఈ అందాల ‘నిధి’పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.