టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కొత్త టాలెంట్ ని పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఇప్పటికే అలాంటి కొత్త టాలెంట్ ని పరిచయం చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు కూడా. తాజాగా నాగార్జున మరో ప్రయోగానికి సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే .. ఈ మధ్య నాగార్జునకు సరైన హిట్ పడడం లేదు.
సోగ్గాడే చిన్ని నాయనతో మంచి హిట్ అందుకున్నా కూడా అది నాగ్ క్రేజ్ కి తగ్గ సూపర్ హిట్ అయితే కాదు. అందుకే ఇప్పుడు సరైన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య చేసిన సినిమాలు రాజుగారి గది 2, ఆఫీసర్, తనకు రొమాంటిక్ హీరోగా మన్మదుడిగా ఇమేజ్ తెచ్చిన మన్మధుడు సినిమాను మన్మధుడు 2గా రీమేక్ చేసిన ఫలితం మాత్రం శూన్యం.
అందుకే తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పాడు నాగ్. సల్మాన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇందులో నాగ్ హీరోగా నటిస్తాడని, హీరోయిన్ గా కాజల్ ఎంపిక అయిందంటూ ప్రచారం జరిగింది, కానీ ఈ సినిమాలో నాగ్ హీరో మాత్రం కాదట ? వాట్ !! షాక్ అయ్యారా ?
మీరు విన్నది నిజమే .. ఈ సినిమా కథ మొత్తం నాగ్ చుట్టే తిరుగుతుందట, కానీ అయన హీరో కాదు .. ఆ సినిమాలో కీ రోల్ లో మాత్రమే కనిపిస్తాడట. హీరో, హీరోయిన్స్ గా ఓ యువ జంట నటిస్తున్నట్టు తెలిసింది. అయితే హీరో ఎవరన్నది పక్కన పెడితే హీరోయిన్ మాత్రం కొత్త అమ్మాయిని పరిచయం చేస్తారట.
ఇప్పుడు నాగ్ కు హీరోగా సరైన సక్సెస్ కావాలి, ఇలాంటి సమయంలో అయన ఈ కొత్త తరహా ప్రయోగం చేయడం అందరికి షాక్ ఇస్తుంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మిస్తారట , త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది.
687835 102087Merely a smiling visitor here to share the adore (:, btw excellent pattern . 995780