కొత్త టాలెంట్ ను, కొత్త తరహా కథలను ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎప్పుడు ముందుంటారు. ఇప్పటికే అయన ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ వైల్డ్ డాగ్ అనే టైటిల్ తో కొత్త ప్రయోగం చేస్తున్నాడు నాగ్. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా టైటిల్ నిన్న ఖరారు చేయడంతో అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. నాగ్ సినిమాకు ఇలాంటి టైటిల్ ఏమిటి ? అని.
ఈ మధ్య వరుసగా పరాజయాలు ఎదురవుతున్న నాగ్ .. వాటిని తప్పించుకునేందుకు అప్పట్లో తనకు ట్రేడ్ మార్క్ గా ఉన్న సినిమా మన్మధుడు కు సీక్వెల్ గా మన్మధుడు 2 అంటూ ప్రయోగం చేసాడు. ఈ వయసులోనూ కుర్రాడిగా కనిపించడానికి నాగ్ పడ్డ ఆరాటం ఆ సినిమాలో కనిపించింది. అయితే రెండో మన్మదుడుకి మాత్రం జనాలు ఓకే చెప్పలేదు .. దాంతో కొంత కావాలనే గ్యాప్ తీసుకున్న నాగ్ .. ఇప్పటికే స్క్రిప్ట్ తో సహా ఓకే అయినా బంగార్రాజు కథను పక్కన పెట్టి .. ఈ వైల్డ్ డాగ్ కథను ఎంచుకున్నాడు.
సల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ విజయ్ వర్మ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారి ఎన్ ఐ ఏ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. మాస్ మసాలా అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తారట.
799934 112656Hey! Good stuff, do tell us when you post something like that! 535419
685172 857292a whole lot lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 918174