Naa Saami Ranga: కింగ్ నాగార్జున (Nagarjuna) నటిస్తున్న కొత్త సినిమా ‘నా సామి రంగ’ (Naa Saami Ranga). విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నటిస్తోంది. ఇప్పుడీ హీరోయిన్ ప్రోమొ నెట్టింట సందడి చేస్తోంది. ఆమె అందానికి సినీ ప్రేమికులు, యువత ఫిదా అవుతున్నారు. సినిమాలో వరలక్ష్మిగా ఆమెను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకునే విధంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
సినిమాలో ఆషికాతోపాటు నాగార్జున లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నాగార్జున తనదైన చార్మ్ తో ఆకట్టుకున్నారు. వరలక్ష్మిగా ఆషికా సిగ్గుపడుతూ ఆకట్టుకుంది. ఇద్దరి మధ్యా చూపిన రొమాంటిక్ లుక్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పాలి. సినిమాకు ఇవే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సినిమా నుంచి ‘ఎత్తుకుపోవాని అనిపిస్తుంది’ అనే పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమా వచ్చే సంక్రాంతి రేసులో నిలిచింది. సినిమాకు మరో ఆకర్షణగా కీరవాణి సంగీతం ఉంటుందని అంటున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్లో సినిమా తెరకెక్కుతోంది.