ప్రత్యేక హోదా ఏదీ.? రాష్ట్రంలో రహదార్లకు పడ్డ గుంతల సంగతేంటి.? పోలవరం ప్రాజెక్టు మాటేమిటి.? రాజధాని వుందా.? లేదా.? పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రో మంటలు.. ఇవేవీ కాదు ముఖ్యం. సినిమా టిక్కెట్ల వ్యవహారమొక్కటీ చాలు.!
రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే వున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేస్తే సామాన్యులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో రోడ్లు బాగు చేస్తే.. ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, రాష్ట్రానికి అది ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.
కానీ, జస్ట్ సినిమా టిక్కెట్ల చుట్టూ రచ్చ రేపి, దాంతో బంతాట ఆడుకుంటోంది వైసీపీ సర్కారు. సంక్రాంతి పండక్కి, ప్రత్యేక బస్సుల పేరుతో దోపిడీ షురూ అవబోతోంది. కానీ, అక్కడ ప్రయాణీకుల వెతలు ప్రభుత్వానికి పట్టవు. సామాన్యుడికి ప్రయాణాన్ని తక్కువ ధరకు అందించాలన్న కనీస ఇంగితం పాలకులకు వుండదు.
వినోదాన్ని మాత్రం తక్కువ ధరకి అందించేయాలి. తక్కువ ధర సంగతి దేవుడెరుగు, పూర్తిగా థియేటర్లన్నీ మూతపడితే అసలు వినోదమే వుండదు. సినీ పరిశ్రమకు రాష్ట్రం ఊతమిస్తే, రాష్ట్రంలో సినిమా షూటింగులు జరుగుతాయి.. సినిమాలకు సంబంధించి సాంకేతిక అవసరాలు రాష్ట్రంలో లభించేలా ఏర్పాట్లూ జరుగుతాయి.
కానీ, సినీ పరిశ్రమను వేధింపులకు గురిచేస్తే లాభమేంటి.? నిజమే, సినిమా టిక్కెట్ల పేరుతో దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం. కానీ, ఆ దోపిడీని అరికట్టడానికి ఇదా మార్గం.? థియేటర్లలో తనిఖీల పేరుతో మొత్తంగా సినిమా థియేటర్ల వ్యవస్థనే అయోమయంలో పడేసి, ప్రభుత్వం సాధించేదేంటి.?
డైవర్షన్ రాజకీయం.. ఔను, ఇది నిఖార్సయిన రాజకీయం. అధికార పార్టీ తన వైఫల్యాల్ని కప్పిపుచ్చెుకునేందుకు ‘సినిమా’ నాటకానికి తెరలేపింది. లేకపోతు, రెండున్నరేళ్ళుగా లేని ఈ ‘చిత్ర’విచిత్రమైన రచ్చ ఇప్పుడెందుకు జరుగుతున్నట్టు.?
774626 262047I admire the valuable facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im extremely positive theyll learn a lot of new items right here than anybody else! 621030
844885 635437have to do first? Most entrepreneurs are so overwhelmed with their online business plans that 840988
372014 409315I saw lots of website but I think this one contains something unique in it in it 25593