Switch to English

పెగాసస్ ఎఫెక్ట్: కరోనా ముప్పు నుంచి మోడీ సర్కార్ సేఫ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్ కంటే పెద్ద సమస్య దేశంలో ఏదైనా వుందా.? వేలాది మందిని బలిగొన్న కరోనా వైరస్, ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలు.. ఇవేవీ చర్చకు రాలేదు. కానీ, కేవలం పెగాసస్ చుట్టూనే రాజకీయ రచ్చ జరుగుతోంది పార్లమెంటు సమావేశాల సాక్షిగా. అసలేం జరుగుతోంది దేశంలో.?

చిత్రమేంటంటే, కేంద్రాన్ని తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై నిలదీస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి, పూర్తిగా సైలెంటయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, పార్లమెంటు సాక్ష్షిగా తమ రెబల్ ఎంపీపై అనర్హత వేటు కోసం పోరాడుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, మోడీ సర్కార్ విసిరిన పెగాసెస్ ఉచ్చులో ఇరుక్కుపోయి విలవిల్లాడుతోంది.

నిజమే, పెగాసస్ స్పై వేర్ అంశంపై చర్చ జరగాల్సిందే. అదీ ప్రాముఖ్యమైన అంశమే. కానీ, ప్రజల ప్రాణాలకంటే తీవ్రమైన అంశమైతే కాదది. అసలు దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలెవరూ ప్రాణాలు కోల్పోలేదని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్, అంత తేలిగ్గా ఎలా పార్లమెంటు వేదికగా ప్రకటించగలిగింది.? ఎందుకంటే, అడిగే దిక్కు లేదు గనుక.

ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన వేలాది మందిలో ఒక్కరూ దెయ్యాల రూపంలో అయినా వచ్చి, పార్లమెంటు సాక్షిగా తమని చంపేసింది ఆక్సిజన్ కొరత.. అని చెప్పే అవకాశం లేదు కదా.? పోనీ, విపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలైనా, వాస్తవాల్ని పార్లమెంటు ముందుంచుతాయా.? అంటే అదీ లేదు.

దేశంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఎవరు అధికారంలో వున్నా, చట్ట సభల నిర్వహణ విషయమై ఓ పద్ధతి ప్రకారం గందరగోలం సృష్టిస్తున్నారు. కీలకమైన సమస్యలేవీ చర్చకు రాకుండానే చట్ట సభల నిర్వహణ గత కొన్నేళ్ళుగా అత్యంత సజావుగా (జుగుప్సాకరంగా) జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. రావడం, గొడవ చేయడం.. సభ వాయిదాల మీద వాయిదా పడటం.. ఇదే చట్ట సభల నిర్వహణ అంటే. రాష్ట్రాల స్థాయిలో అసెంబ్లీ, శాసన మండలి ఎలా నిర్వహించబడుతోందో, అంతకు మించి గొప్పగా పార్లమెంటు ఉభయ సభలు నిర్వహించబడతాయని ఆశించగలమా.?

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ వైఫల్యం.. పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. మరి, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న ఇంగితం ఎవరికైనా వుందా చట్ట సభల్లో.? సామాన్యుల ప్రాణాలే కాదు, ప్రజా ప్రతినిథులు కూడా ప్రాణాలు కోల్పోయారు కరోనా వల్ల. అందులో పార్లమెంటు సభ్యులూ వున్నారు. అయినా సరే, వ్యవస్థ మారదు.. బాధ్యత గుర్తెరగదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...