Biggboss : కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 తాజాగా ప్రారంభం అయింది. కన్నడం లో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ ను మరియు పబ్లిసిటీని తాను వినియోగించుకోవాలి అనుకున్నాడో ఏమో కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ హౌస్ లో అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ వంటి రియాల్టీ షో లో ఏ పొలిటీషన్ అడుగు పెట్టిందే లేదు. మొదటి సారి ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇచ్చారు అంటూ నిర్వాహకులు ప్రచారం చేసుకున్నారు.
ఎమ్మెల్యే ఈసారి కంటెస్టెంట్ గా ఉండటం తో చాలా మంది అవాక్కయ్యారు. ఈ సారి రేటింగ్ విషయంలో దుమ్ము రేపడం ఖాయం అని నిర్వాహకులు ఆశ పడ్డారు. తీరా ఎమ్మెల్యే తనపై వస్తున్న విమర్శల నేపథ్యం లో వెంటనే హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లుగా తెలుస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కి ఒక సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. నియోజక వర్గం బాధ్యతలు పట్టకుండా బిగ్ బాస్ కి ఎమ్మెల్యే వెళ్లడంను ఎవరు కూడా హర్షించడం లేదు. దాంతో ఎమ్మెల్యే ఊరికే వెళ్లాను.. కంటెస్టెంట్స్ తో సరదాగా ఒక రోజు ఉండి వారిని ఉత్సాహపరిచేందుకు వెళ్లాను అంటూ కలరింగ్ ఇచ్చి బయటకు వచ్చేశాడట.