Chiranjeevi: ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)తన తల్లి అంజనా దేవికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘అనురాగం, మమకారం ఈ రెండింటికి అర్థమే అమ్మ.. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం ఆమెను చూసి మేమందరం నేర్చుకున్నాం. అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని నోట్ రాసి తన తల్లితో తీసుకున్న ఫోటోలను ట్వీట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరుకి తన తల్లితో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో తన తల్లి మీద ఉన్న ఇష్టాన్ని మెగాస్టార్ బయట పెట్టారు. ఆమెతో కలిసి గడిపిన ప్రతి సందర్భాన్ని చిరు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ‘భోళాశంకర్( Bhola Shankar)’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తమన్నా( Tamannaa)కథానాయిక. మెహర్ రమేష్( Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్( Keerthy Suresh)ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది. తమిళ సినిమా ‘వేదాళం( Vedalam)’ కు రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం
అమ్మ ని చూసే నేర్చుకున్నాం.
అమ్మలందరికి #HappyMothersDay🙏💐 pic.twitter.com/6Xm4l1R14d— Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2023