Switch to English

మెడికల్‌ మాఫియా.. కరోనా ఈ కేటుగాళ్ళకి రాదెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రపంచం కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంటే, ‘మెడికల్‌ మాఫియా’ శవాల మీద పేలాలు ఏరుకుంటోంది. ఔను, నిజ్జంగా నిజమిది. కరోనా వైరస్‌ బారిన పడ్డవారికి ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో దివ్యౌషధంగా చెప్పబడుతూ కొన్ని మందులు మార్కెట్‌లోకి వచ్చాయి. గ్లెన్‌మార్క్‌, హెటిరో తదితర సంస్థలు ఈ మందుల్ని తయీరు చేసిన విషయం విదితమే. ధర అటూ ఇటూగా 5 వేల రూపాయలు పలుకుతున్నాయి సాధారణ రేటు ప్రకారం అయితే. కానీ, మనది ‘మెడికల్‌ మాఫియా’ ప్రపంచం కదా.! ఆ ఐదు వేల రూపాయల విలువ చేసే మెడిసిన్‌ ఏకంగా 40 నుంచి 50 వేల దాకా పలుకుతోంది.

నిజానికి, ఈ మెడిసిన్స్‌ని తక్కువ మొత్తంలోనే తయారు చేస్తున్నారు. పైగా, ఇవి సాధారణ మార్కెట్‌లో దొరకవు. కానీ, డబ్బులు ఎక్కువ పెడితే చాలా తేలిగ్గా దొరికేస్తాయి.. దొరికేస్తున్నాయి కూడా.! హైద్రాబాద్‌లో ఇప్పటికే ఈ ‘మెడికల్‌ మాఫియా’కి సంబంధించి పలువురు అరెస్ట్‌ అయ్యారు కూడా. ఆక్సిజన్‌ సిలెండర్ల సంగతి సరే సరి. సాధారణ మందులదీ ఇదే పరిస్థితి. ఇంతకీ, కరోనా సోకినవారికి ఇచ్చే మెడిసిన్స్‌ ఎలా పక్కదారి పడుతున్నాయి.? కంపెనీలే ‘బ్లాక్‌ మార్కెట్‌’కి తరలిస్తున్నాయని అనుకోవాలా.? కంపెనీల నుంచి బయటకు వచ్చాక.. పక్కదారి పడుతున్నాయని అనుకోవాలా.? కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు అవసరానికి మించి మందులు తెప్పించి, వాటిల్లో కొన్నింటిని వినియోగించి, మిగతావాటిని బ్లాక్‌మార్కెట్‌కి పంపిస్తున్నాయని అనుకోవాలా.? ‘నేరం ఎక్కడ జరుగుతోంది.?’ అన్నది విచారణలో తేలుతుంది.

కానీ, ఇలాంటి ఘటనల్లో నిందితులకి సాధారణ శిక్షలు, జరీమానాలు సరిపోవు. మందులు దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ‘మెడికల్‌ మాఫియా’కి తెరలేపిన అక్రమార్కులపై హత్యకేసులు నమోదు చేసినా తప్పు లేదేమో.! సాధారణ పరిస్థితులు కావివి. దాదాపుగా హెల్త్‌ ఎమర్జన్సీ పరిస్థితులు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు.? అన్ని విభాగాలపైనా నిఘా వుంచాల్సిన అధికార యంత్రాంగం నుంచే కొందరు ఈ మాఫియాకి సహకరిస్తున్నారేమోనన్న అనుమానాలూ కలుగుతున్నాయి మందులు దొరక్క తమవారిని కోల్పోయిన వారి నుంచి. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా సంక్షోభాన్ని కూడా ‘క్యాష్‌’ చేసుకుంటున్నారంటే, ఈ మెడికల్‌ మాఫియాని మింగేయడానికి కరోనా వైరస్‌ కంటే ఇంకా పెద్దదేదో రావాలేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...