హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాలో నటనతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతగా తనదైన నటన, హావభావాలతో పాత్రలో ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం తెలుగులో ఆమెకు అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. అయితే.. వచ్చిన అవకాశాల్లో తగిన పాత్రలను ఆచితూచి ఎంచుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మృణాల్ కు ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు అంతే క్యూట్ గా సమాధానం ఇచ్చింది.
తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ నెటిజన్ మృణాళ్ కు పెళ్లి ప్రపోజల్ చేశాడు. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఓకే’ అని కామెంట్ చేశాడు. దీనికి మృణాల్ రిప్లై ఇస్తూ.. ‘మరి నా వైపు నుంచి ఓకే కాదుగా’ అని ఓ క్యూట్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ మెసేజ్ వైరల్ అయింది. మృణాళ్ త్వరలో నాని హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. ఇటివలే ఆమె హిందీలో నటించిన సెల్ఫీ విడుదలైంది