సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు తన సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తరువాత కేవలం ఫ్యామిలితో కలిసి విదేశాలను చుట్టి రావడం తెలిసిన విషయమే. ఇప్పటికే పదిహేను రోజులపాటు విదేశాల్లో గడిపేసిన మహేష్ నిన్న ఆదివారం హైదరాబాద్ లో ఫ్యామిలీతో పాటు ల్యాండ్ అయ్యాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ చాలా ఉత్సహంగా కనిపించారు. తాజాగా మహేష్ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు కాబట్టి అయన నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎఫ్ 2 లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా మారిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో మహేష్ నటిస్తున్నాడు. మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివరివారంలో మొదలు కానుంది. మహేష్ సరసన రష్మిక మండన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాజీ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుంది.
పూర్తీ స్థాయి ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంటుందట. ఇందులో మహేష్ సోల్జర్ గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.
69360 57537I view something genuinely particular in this site . 154464
594838 587924Thanks for the post. I like your writing style – Im trying to start a blog myself, I feel I might read thru all your posts for some suggestions! Thanks once more. 553659