Switch to English

మద్యంపై యుద్ధం: వైఎస్‌ జగన్‌ చేయగలరా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తాగుబోతుల్ని ట్యాక్స్‌ పేయర్స్‌ అనాలంటూ చాలా సినిమాల్లో డైలాగ్స్‌ని విన్నాం. అది నిజమే, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాకి వరం. తమ జీవితాల్ని నాశనం చేసుకుని మరీ, రాష్ట్ర ఖజనాని కాపాడుతున్నారు తాగుబోతులు. అలాంటి తాగుబోతుల పొట్ట కొడితే ఎలా? వినడానికి ఫన్నీగానే వున్నా, అత్యంత జుగుప్సాకరమైన లాజిక్‌ ఇది. మద్యం అమ్మకాలతో ఖజానా కళకళలాడుతుందన్నది నిర్వివాదాంశం. కానీ, ఆ మద్యం మొత్తం వ్యవస్థనే నీరుగార్చేస్తోంది. మద్యానికి ఓ వ్యక్తి బానిసైతే, అతని కుటుంబం రోడ్డున పడుతుంది. మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ, మొత్తం వ్యవస్థ సర్వనాశనమైపోతుంది.

స్వర్గీయ నందమూరి తారకరామారావు తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మద్య నిషేధాన్ని తెరపైకి తెచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి, ఆఖరిసారి కూడా. కానీ, ఆ మద్య నిషేధం కారణంగా చాలా సమస్యలూ తలెత్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, మద్య నిషేధాన్ని ఎత్తివేయడమే కాదు, మద్యమే ఖజనాకి ప్రధాన ఆదాయవనరు అనే స్థాయికి మద్యం అమ్మకాలు పెరిగేలా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక తెలుగు రాష్ట్రాల్లో మద్యం మరింత విచ్చలవిడిగా ప్రవహించింది,, ప్రవహిస్తూనే వుంది.

ఇలాంటి పరిస్థితుల్లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మద్య నిషేధం దిశగా తొలి అడుగు వేయబోతోంది. దశల వారీగా ఈ నిషేధంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అధికారులకు సూచించారు. తొలుత మద్య నియంత్రణ, ఆ తర్వాత నిషేధం.. ఇదీ వైఎస్‌ జగన్‌ ఆలోచన. నిజానికి, ఇది చాలా మంచి ఆలోచన. గెలవడం కోసం ఇచ్చిన ఉత్తుత్తి హామీగానే నిన్న మొన్నటిదాకా మద్య నిషేధం గురించి అందరూ మాట్లాడుకున్నారు. కానీ, అదిప్పుడు కార్యరూపం దాల్చబోతోంది.

ఒకవేళ వైఎస్‌ జగన్‌ గనుక తన టెర్మ్‌ పూర్తయ్యేసరికి మద్య నిషేధం అమలు చేయగలిగితే, స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత ఆ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. కానీ, అదంత తేలికైన విషయం కాదు. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలవుతుంది. మద్యానికి బానిసలుగా మారినవారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బెల్టు షాపుల నిర్వాహకుల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, వైఎస్‌ జగన్‌ మద్యనిషేధం కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది.

పొరుగు రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం, నియంత్రణ అమల్లో లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో ఇంతటి కష్టతరమైన ప్రక్రియ చేపట్టడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కానే కాదు. అన్నిటికీ మించి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ మద్యం వ్యాపారులు చాలామందే వున్నారు. వారందరి నుంచీ వెల్లువెత్తే వ్యతిరేకతను తట్టుకోవడం వైఎస్‌ జగన్‌కి సాధ్యమా.? నేటి రాజకీయాలు నడుస్తున్నదీ మద్యం వ్యాపారం మీదనే. మద్యం లేని రాజకీయాలే లేవు. మరి, జగన్‌ ఎలా సాధించగలుగతారు మద్య నిసేధాన్ని.? వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...