కాంచన సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా మారిపోయాడు లారెన్స్. ముని సీక్వెల్స్ తో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా కాంచన చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. లక్ష్మి బాంబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తరువాత ముని సీక్వెల్ గా ముని 5 ని తీసే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఈ సినిమాకంటే ముందే మరో క్రేజీ రీమేక్ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు.
ఆ రీమేక్ ఏమిటో తెలుసా .. రంగస్థలం! రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను రీమేక్ చేయడానికి తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు లారెన్స్. రామ్ చరణ్ పాత్రలో లారెన్స్ నటిస్తాడట. ఈ చిత్రానికి లింగు స్వామి దర్శకత్వం వహిస్తాడట. ఇప్పటికే లింగు స్వామి ఈ సినిమాకు సంబందించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.
లారెన్స్ హిందిలో చేస్తున్న లక్ష్మి బాంబు సినిమా షూటింగ్ జనవరిలో పూర్తవుతుందని, ఆ సినిమా పూర్తీ కాగానే రంగస్థలం రీమేక్ ని పట్టాలు ఎక్కించే ప్రయత్నాలుక్ చేస్తారట. అచ్ఛమైన పల్లెటూరి యువకుడిగా రామ్ చరణ్ కొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. మరి ఈ సినిమాలో లారెన్స్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.
