Switch to English

ఆ 24 నిమిషాలు: కోడెల ఆత్మహత్య వెనుక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

నిన్న మరణించిన కోడెల శివప్రసాద్‌ అంతిమ సంస్కారాలు ఇంకా పూర్తవలేదు. కానీ, కోడెల మరణం చుట్టూ రాజకీయాలు ముసురుకున్నాయి. కోడెల మరణం నేపథ్యంలో పొలిటికల్‌ మైలేజ్‌ కోసం టీడీపీ, ఆ మైలేజ్‌ టీడీపీకి దక్కకూడదని వైసీపీ పడుతున్న పాట్లు చూసి జనం అసహ్యించుకుంటున్న మాట వాస్తవం. మరోపక్క, కోడెల మరణం చుట్టూ రకరకాల ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. ఆయన మాజీ సభాపతి.. గతంలో హోంమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే, పుకార్లను ప్రచారంలోకి తీసుకురావడం ఎంతవరకు సబబు.? అన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.

నైతిక విలువల గురించి గొప్పగా చెప్పుకునే, ఈనాడు.. కోడెల మరణాన్ని ధృవీకరించకముందే.. ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడనీ, ప్రమాదకరమైన ఇంజెక్షన్‌ చేసుకున్నారనీ ప్రకటించేయడం గమనార్హం. టీడీపీ అనుకూల మీడియా నుంచి ఈ తరహా కథనాలు రావడం కొంత అనుమానించదగ్గ విషయమేనన్నది అధికార పార్టీ చెబుతున్న మాట. మరి, వైఎస్‌ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతిని గుండెపోటుగా సాక్షి ఎలా ప్రచారంలోకి తీసుకొచ్చింది.? అందరూ గురివిందలే.. అని ఈ విషయాలు నిరూపిస్తున్నాయి.

Also Read: కోడెల డెత్‌ మిస్టరీ: శవ రాజకీయం అందరిదీ.!

మరోపక్క, కోడెల వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌ మిస్సయ్యిందంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి. నిన్న ఉదయం 8 గంటల సమయంలో ఏకంగా 24 నిమిషాల పాటు ఎవరితోనో మాట్లాడారట. అదిప్పుడు విచారణలో కీలకంగా మారిందంటూ కథనాలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ కేసుని తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ విచారణ బృందం నుంచే ఈ లీక్‌ బయటకు వచ్చిందా.? అన్న విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.

తెలంగాణలోని అధికార పార్టీకీ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకీ మధ్య సఖ్యత గురించి కొత్తగా చెప్పేదేముంది.? కోడెల మరణంతో వైసీపీ ప్రభుత్వం అప్రతిష్టపాలైన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో వైసీపీని గట్టున పడేసేందుకు తెలంగాణ నుంచి ‘డ్యామేజీ కంట్రోల్‌’ చర్యలు జరుగుతున్నాయన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాట. ఏమో, ఆ 24 నిమిషాల సమయం కోడెల ఎవరితో ఫోన్‌లో మాట్లాడారో ఇప్పుడే చెప్పలేం. అసలు అది నిజమో కాదో కూడా తెలియని పరిస్థితి. కానీ, ఏ చిన్న విషయం వెలుగు చూసినా.. దాని చుట్టూ మళ్ళీ రాజకీయ రచ్చ షురూ అవుతోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...