హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బాలకృష్ణ ఆటలో అరటిపండు లాంటివాడం’టూ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఇతర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడన్నారు. సినిమా షూటింగుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తిరుగే బాలయ్యకు రాష్ట్రంలోని పరిస్థితులు తెలియవని ఎద్దేవా చేశారు.
పెద్దిరెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని.. ఈ విషయం అందరికీ తెలుసని నాని అన్నారు. విశాఖ ఉక్కు విషయంలో మోదీని ప్రశ్నించలేని బాబు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒక శనిగ్రహం అని ఎన్టీయార్ ఏనాడో చెప్పారని నాని గుర్తు చేశారు. శని వదలాలంటే చంద్రబాబుకు పూజలు చేయాలని అన్నారు. వాళ్ల పార్టీ నేతలు తమ శని వదిలించుకోవడానికి చంద్రబాబు చుట్టు తిరుగుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యవు వివాదాస్పదమయ్యాయి.
214330 895452Today, while I was at work, my cousin stole my apple ipad and tested to see if it can survive a thirty foot drop, just so she can be a youtube sensation. My iPad is now destroyed and she has 83 views. I know this is completely off topic but I had to share it with someone! 457220