సినిమాల్లో అవకాశాలు రాకా చాలా మంది పడిగాపులు కాస్తుంటే .. కొందరేమో వచ్చిన అవకాశాలకు వంకలు పెడుతూ, డిసిప్లేన్ లేకుండా కెరీర్ పాడుచేసుకుంటన్నారు. అసలు సినిమా రంగంలో అవకాశాలు రావడమే గగనం అనుకుంటున్నా సమయంలో ఓ హీరోయిన్ మాత్రం అడ్డమైన కండిషన్స్ పెడుతూ దర్శక నిర్మాతలకు టెన్షన్ పెడుతుందట!! దాంతో ఈమే సినిమాకు కమిట్ కాకముందే ఇన్ని కండిషన్స్ పెడితే .. ఇంకా సినిమా ఒప్పుకున్నాకా ఇంకెలాంటి కండిషన్స్ పెడుతుందో దేవుడా అంటూ ఆమె దరిదాపులకు వెళ్ళడానికి భయపడుతున్నారు దర్శక నిర్మాతలు.
ఇంతకీ దర్శక నిర్మాతలను అంతలా భయపెడుతున్న హీరోయిన్ ఎవరు ? అంటారా .. ఆమె ఎవరో కాదు మహానటి సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా మారిన కీర్తి సురేష్. వరుస విజయాలు అందుకున్న కీర్తి కి ఎందుకు ఎక్కువ సినిమాలు రావడం లేదు అన్నది అసలు ప్రశ్న ? ఆమె ఎక్కువ సినిమాల్లో నటించక పోవడం వెనక గ్లామర్ పాత్రలకు ఒప్పుకోకపోవడమే అని టాక్ ఉంది .. కానీ అసలు టాక్ అది కాదట.
దర్శక నిర్మాతలు ఆమెకు కథ చెప్పేందుకు వెళ్ళాకా ..కథ విని నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి, నా పాత్ర తెరపై ఎంతసేపు ఉంటుంది. హీరోకి సమానంగా ఉంటుందా, సినిమా బడ్జెట్ ఎంత. అంటూ ఆమె పర్శనల్ కండిషన్స్ కూడా పెడుతుందట. ఇప్పుడే ఇన్ని కండిషన్స్ పెడితే ఇక సినిమా ఒప్పుకున్నాకా ఇంకా ఎలా ఉంటుందిరా బాబోయ్ .. అంటూ వాళ్ళు చల్లగా జారుకుంటున్నారట.
అలాగే తన ఛాన్సులన్నీ కీర్తి మిస్ చేసుకుంటుందని తెగ ప్రచారం జరుగుతుంది. ఇలా అడ్డమైన కండిషన్స్ పెడితే వచ్చే సినిమాలు కూడా రావని సినీ జనాలు హితవు చెబుతున్నారు .. మరి ఈ విషయంలో కీర్తి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా అంటూ ఓ తెలుగు సినిమా చేస్తోంది. దాంతో పాటు హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది.
815223 866403extremely nice post, i undoubtedly adore this wonderful site, carry on it 910258
777518 967016Oh my goodness! a wonderful write-up dude. Thanks a great deal Nonetheless We are experiencing trouble with ur rss . Do not know why Not able to sign up to it. Perhaps there is anybody getting identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 616422
561689 799826Bookmarked your wonderful internet site. Fabulous work, exclusive way with words! 863434
290983 893417Hmm is anyone else encountering difficulties with the pictures on this blog loading? Im trying to figure out if its a dilemma on my finish or if it is the blog. Any responses would be greatly appreciated. 648706