కీర్తి సురేష్.. తెలుగు ప్రేక్షులకి ‘నేను శైలజ’ సినిమాతో పరిచయమైన ఈ అందాల భామ, గ్లామర్ విషయంలో ఇప్పటిదాకా హద్దులు దాటేయలేదు. గ్లామరస్ పాత్రలకు కాస్త దూరంగా, పద్ధతైన పాత్రలకు చాలా దగ్గరగా వుంటూనే స్టార్డమ్ సంపాదించుకోవడమంటే చిన్న విషయం కాదు ఈ రోజుల్లో. కెరీర్లో ‘లేడీ సూపర్ స్టార్’ ఇమేజ్‌కి చాలా దగ్గరగా వచ్చేసిన కీర్తి సురేష్, త్వరలోనే ఆ ఇమేజ్‌ని సొంతం చేసుకోనుండడం ఖాయంగానే కన్పిస్తోంది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న కీర్తి సురేష్‌కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘హ్యాపీ బర్త్ డే కీర్తి సురేష్’ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు డజను సినిమాలు చేసేస్తోంది కీర్తి సురేష్ ప్రస్తుతం. ఆమె ఏ సినిమా చేసినా, అది దాదాపు సౌత్‌లో కన్నడ తప్ప అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతోంది. తెలుగులో ‘మిస్ ఇండియా’, ‘రంగ్ దే’ సినిమాల్లో నటిస్తోన్న కీర్తి సురేష్, వాటితోపాటు మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది. అన్నీ మల్టీ లాంగ్వేజ్ సినిమాలే.
తాజాగా, కీర్తి సురేష్ నటిస్తోన్న రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ వచ్చాయి. అందులో నాగేష్ కుకునూర్ సినిమా ఒకటి. ఇందులో అస్సలేమాత్రం మేకప్ లేకుండా కన్పిస్తోంది కీర్తి సురేష్. మరోపక్క, ‘పెంగ్విన్’ పేరుతో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రెగ్నెంట్ లేడీ గెటప్‌లో కీర్తి సురేష్ కన్పిస్తుండడం గమనార్హం. ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డుని దక్కించుకున్న కీర్తి సురేష్, బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తోన్న విషయం విదితమే. సినిమా సినిమాకీ తన రేంజ్‌ని పెంచుకుంటూ వెళుతోన్న కీర్తి సురేష్, 2020లో ‘లేడీ సూపర్ స్టార్’ ఇమేజ్ ఖారారు చేసుకునే అవకాశాలు సుస్పష్టంగా వున్నాయి.
81477 79141I enjoy searching via and I conceive this website got some truly valuable stuff on it! . 281597
949762 571852Overall, politicians are split on the concern of whether Twitter is far more for business or personal use. The very first thing may be the fact that you can build up quite a large following of people. 232948