Switch to English

సినీ న‌టుల‌కు కెసిఆర్ బెదిరింపులు: చంద్ర‌బాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ లపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ బెదిరింపుల వల్లే జగన్‌ దగ్గరకు సినీనటులు క్యూ కడుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. . ఒక్కసారి ప్లీజ్ అంటూ వైసీపీ మొసళ్లు దొంగ కన్నీరు పెడుతున్నారని మండిపడ్డారు.

‘‘ఒక్కసారి అని తినే తిండిలో విషం కలుపుకుంటామా..?. ఒక్కసారి అని ఎవరైనా కొండపైకెక్కిలోయలో దూకుతారా..?’’ అని సీఎం ప్రశ్నించారు. యువతకు ఇచ్చే రూ.2వేలకు వైసీపీ అడ్డంకులు పెట్టిందని ధ్వజమెత్తారు. పసుకు-కుంకుమ ఆపాలని హైకోర్టులో పిటిషన్లు వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకిచ్చే పసుపు-కుంకుమ ఎవరైనా అడ్డుకుంటారా..? అని తీవ్రంగా ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే డబ్బులు ఆగకూడదట..రాష్ట్రం ఇస్తే ఆపాలట అని సీఎం అన్నారు.

మోడీ, దత్తపుత్రుడు జగన్‌పై ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మైనార్టీలపై బీజేపీ దాడులు-దౌర్జన్యాలకు పాల్పడుతుందని చెప్పారు. బీజేపీకే కాదు, వైసీపీకి కూడా మైనారిటీలు బుద్ధిచెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీతోనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. 25 మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా సాధిస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా పులివెందులలో తమ పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు, చిత్తూరు, అన్నిచోట్లా టీడీపీపై సానుకూలత ఉందన్నారు. ప్రజల్లో కసిని, పౌరుషాన్ని టీడీపీకి ఓట్లుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీపై ఎక్కడ చూసినా తీవ్ర వ్యతిరేకత ఉందని టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలకు సూచించారు.

ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోడీకి చేతులు రాలేదు కానీ..ఏపీని, టీడీపీని నిందించడానికి మాత్రం మోదీకి పెద్దనోరు ఉందని మండిపడ్డారు. మోడీ అహంభావానికి గుణపాఠం చెప్పాలన్నారు. కేసుల కోసం మోడీతో..ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడుతున్నారని సీఎం ధ్వజమెత్తారు.

‘‘తెలంగాణకూ హోదా ఇవ్వాలన్న కేసీఆర్‌తో కలిసి రాష్ట్రానికి జగన్‌ హోదా తెస్తాడా?. పోలవరంపై పదేపదే కేసులేసే కేసీఆర్‌కు జగన్ మద్దతా..?. సాగర్, శ్రీశైలం మాకే ఇవ్వాలన్న కేసీఆర్‌కు జగన్ సపోర్టా..?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ఆపాలనే కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని అన్నారు. సీమను ఎడారిచేయాలనే కేసీఆర్‌కు జగన్ మద్దతా..? అని మండిపడ్డారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...