Switch to English

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు పక్కకేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

సారు.. కారు.. 16.. ఢిల్లీలో సర్కారు నినాదంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్.. తాను గెలుచుకునే 16 సీట్లతో కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ప్రాంతీయ పార్టీలదే హవా అని, కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు సమావేశమై చర్చలు కూడా జరిపారు.

ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. కేసీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా కాంగ్రెస్, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. అయితే, కేసీఆర్ తాను అనుకున్నంతగా ఈ విషయంలో విజయం సాధించలేకపోయారు. మమత గానీ, స్టాలిన్ గానీ కేసీఆర్ ను అంతగా పట్టించుకోలేదు. చూద్దాంలే అనే ధోరణిలో ఈ ఇరువురు నేతలూ వ్యవహరించారు. తాజాగా చెన్నై వెళ్లి స్టాలిన్ ను కలిసినప్పుడు కూడా ఆ సమావేశం అంత ఫలప్రదం కాలేదు. దీంతో పునరాలోచనలో పడిన కేసీఆర్.. తన ప్రయత్నాలకు కాస్త విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి కాంగ్రెస్ లేదా బీజేపీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం సులభం కాదనే విషయం కేసీఆర్ కూ తెలుసు. కానీ ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. ఈ అంశంలో ఆయనకు ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. దీంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. చెన్నైలో స్టాలిన్ తో సమావేశం తర్వాత కేసీఆర్ తీరులో మార్పు వచ్చిందని అంటున్నారు.

ఇప్పటివరకు తాను జాతీయ స్థాయి రాజకీయాల వైపు వెళ్లి, రాష్ట్రంలో తన పీఠాన్ని కుమారుడు కేటీఆర్ కి అప్పగించాలని భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో చక్రం తిప్పడం అంత సులభం కాదనే విషయం అర్థం కావడంతో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు సంయమనం పాటించాలని, ఫలితాలు వచ్చాక అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ కి తాజా పరిస్థితులు అర్థం కావడంతో కాస్త మెత్తబడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలని.. రాష్ట్రానికి అండగా నిలబడి అధిక నిధులిచ్చే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది యూపీఏ అయినా, బీజేపీ అయినా తమకు కలసి వచ్చే పార్టీకే మద్దతివ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇక ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టి, రాష్ట్ర పాలనపై దృష్టి సారించారు. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలు జరపడంతోపాటు ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫెడరల్ ఫ్రంటా లేక యూపీఏనా, బీజేపీనా అనే విషయం క్లారిటీ రానుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...