Switch to English

బ్రేకింగ్: జగన్‌కి కేసీఆర్‌ ‘కాస్ట్‌లీ గిఫ్ట్‌’ రెడీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రిటర్న్‌ గిఫ్ట్‌ కాదిది, రియల్‌ గిఫ్ట్‌ అట. ఇది నిజమేనా? అని ఎవరైనా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేంతటి పెద్ద గిఫ్ట్‌ అని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారట. అదీ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఇవ్వడం కోసమట. ఇదిప్పుడు తెలుగునాట రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.

విషయమేంటంటే, ప్రస్తుతం తెలంగాణలో వున్న భద్రాచలం పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చేయడానికి తెరవెనుక ఏర్పాట్లు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయట. వాస్తవానికి భద్రాచలం తెలంగాణ ఆస్తి కానే కాదు, ఒకప్పుడు భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌లోనే వుండేది. పరిపాలనా సౌలభ్యం కోసం చాలకాకాలం క్రిందటే భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ని తూర్పుగోదావరి జిల్లా నుంచి విడదీసి, తెలంగాణలోని అప్పటి ఖమ్మం జిల్లాలో కలిపారు.

అదొక్కటే కాదు, పశ్చిమగోదావరి జిల్లాలోని కొంత భాగం కూడా తెలంగాణలో కలిసింది. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత భద్రాచలం తెలంగాణతోనే వుండిపోయింది. అలా తెలంగాణలోనే భద్రాచలం వుండటానికి చాలా కారణాల్ని చూపెడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. తిరుపతి అంతటి పెద్ద పుణ్యక్షేత్రంగా తెలంగాణలో భద్రాచలం వర్ధిల్లుతున్న దరిమిలా, దాన్ని ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చేయడం మంచిది కాదన్న ఆలోచనతోనే అప్పుడలా చేశారట. దాంతోపాటుగా, భద్రాచలం కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడం కంటే, తెలంగాణకు రావడం చాలా సులభం. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే విభజన చట్టంలో భద్రాచలాన్ని తెలంగాణకి పరిమితం చేశారు.

అయితే, భద్రాచలం పరిసర ప్రాంతాలు చాలావరకు ఆంధ్రప్రదేశ్‌లోనే కలిసిపోయాయి. అయితే, దాంట్లో చాలావరకు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంగా మారుతోందిప్పుడు. ఏదిఏమైనా, భద్రాచలంను తిరిగి ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చేస్తారనే గాసిప్‌ని నిజమని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా భద్రాచలం అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయ విమర్శలు చేస్తుంటారు కేసీఆర్‌. ఆ అవకాశాన్ని ఆయన ముందు ముందు కొల్పోయే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటారు?

అయితే, కేంద్రం మాత్రం భద్రాచలంను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు సానుకూలంగా వుందని తెలుస్తోంది. అదే నిజమైతే, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఎలాగూ తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గతంలో కేటాయింపబడ్డ కార్యాలయాల్ని తిరిగి తెలంగాణకు వైఎస్‌ జగన్‌ అప్పగించేశారు కాబట్టి, దానికి కృతజ్ఞతగా కేసీఆర్‌ భద్రాచలంను ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చేస్తామంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కాదనగలరా?

4 COMMENTS

  1. 856748 826135The next time I just read a weblog, I really hope which it doesnt disappoint me up to this one. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something intriguing to convey. All I hear can be a handful of whining about something you can fix within the event you werent too busy trying to locate attention. 249061

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...