Switch to English

Jr.Ntr Birthday Specials: తొలి అడుగుల్లోనే విజయం.. తాతకు తగ్గ మనవడిగా ‘Jr ఎన్టీఆర్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Jr.Ntr Birthday Specials: అచ్చం ఎన్టీఆర్ ను చూస్తున్నట్టే ఉంది.. ఎవరబ్బాయి..? 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాల రామాయణం సినిమాలో రాముడి పాత్రలో ఒదిగిపోయిన బాలుడ్ని చూసి సగటు సినీ ప్రేక్షకుల మదిలో మెదిలిన ప్రశ్న. అనేక సినిమాల్లో రాముడిగా సమ్మోహన రూపంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నందమూరి తారకరామారావు మనవడే ఈ చిన్న రామయ్య అనుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ తనయుడు. తండ్రి పేరే కుమారుడికి పెట్టుకున్నారు. అతడే నందమూరి తారక రామారావు. తాత పోలికలే ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ గా పిలుచుకున్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ గా తాత ఎన్టీఆర్ దర్శకత్వంలో 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించాడు. సరిగ్గా పదేళ్లకే నందమూరి వంశం నుంచి వచ్చిన మిస్సైల్ గా 2001లో వెండితెరపై హీరోగా తెరంగేట్రం చేశాడు ఎన్టీఆర్.

రాముడిగా ఒదిగిన చిన్న రామయ్య..

నిజానికి దర్శకుడు గుణశేఖర్ చిన్న పిల్లలతో రామాయణం తెరకెక్కించాలని భావించడమే ఓ సవాల్. అందమైన కావ్యంగా ఆ సినిమాను తెరకెక్కించి ఆయన విజయం సాధిస్తే.. అందుకు రాముడిగా నటించిన ఎన్టీఆర్ తాతను మరిపించి సినిమాకు మరింత కళను అద్దారు. దీంతో నాటి లవకుశలో ఎన్టీఆర్ ను చూసిన అనుభూతినే ప్రేక్షకులు పొందారు. నందమూరి అభిమానులైతే చిన్న ఎన్టీఆర్ ను చూసి పులకించిపోయారు. నందమూరి వంశానికే బ్రాండ్ అయిన మైథలాజికల్ జోనర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడం సగటు నందమూరి అభిమానికి ఎంతో సంతోషాన్నిచ్చింది. చిన్న వయసులోనే నటనపై ఉన్న స్పష్టతను చూపాడు జూనియర్ ఎన్టీఆర్. తాతతో పోలిక అనేది ఆ వయసుకి అర్ధమయినా కాకపోయినా.. తనలో ఉన్న నటననే రాముడిగా నటించి మెప్పించాడు.

నటనలో మేటి..

అటుపై.. పూర్తిస్థాయి హీరోగా ఎన్టీఆర్ తెరంగేట్రం 2001లో నిన్ను చూడాలని సినిమాతో ప్రారంభమైంది. నందమూరి వంశం నుంచి మూడో తరం హీరో తప్పితే.. అప్పటికి ఎన్టీఆర్ పై భారీ అంచనాలు, అభిమానుల ఆశలు వంటివి ఏమీ లేవు. కానీ.. తనలో ఉన్న నట వారసత్వంకి తోడు తన ప్రజ్ఞాపాటవాలు ఎన్టీఆర్ కు తెరపై కొత్తగా ఏమీ అనిపించలేదు. సినిమాలో ఎక్కడా కొత్తగా ఫీలయిన సన్నివేశం ఎన్టీఆర్ నుంచి కనపడదు. అంతకంటే చిన్న వయసులోనే రాముడిగా మెప్పించిన ఎన్టీఆర్ సామాజిక కథాంశంలో హీరో పాత్ర ఆయనకో కేక్ వాక్ లా అయిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్త హీరోగా తన నటనతో మెప్పించి అతి తక్కువ కాలంలోనే నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గా చేరువయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...