యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ కరోనాతో పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన ఒకానొక సమయంలో చాలా క్రిటికల్ పరిస్థితుల్లోకి వెళ్లి పోయాడు అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. మెల్లగా ఆయన కోలుకుంటున్నట్లుగా వైధ్యులు తెలియజేశారు. కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అప్ డేట్ ఇస్తున్నారు. నేడు జీవిత ఒక వీడియో బైట్ ను విడుదల చేసి రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. ఆయన కోలుకుంటున్నట్లుగా పేర్కొంది.
సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వైధ్యులు చాలా బాగా రాజశేఖర్ గారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డాక్టర్ గారు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర్ గారి ఆరోగ్యం పట్ల శ్రద కనబర్చుతున్నారు. త్వరలోనే రాజశేఖర్ గారు ఐసీయూ నుండి బయటకు వస్తారని జీవిత అన్నారు. కొన్ని మీడియాల్లో వెంటిలేటర్ పై రాజశేఖర్ గారు ఉన్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. ఆయన క్రిటికల్ పరిస్థితుల్లోకి వెళ్లిన విషయం నిజమే కాని ఆయన్ను వెంటి లేటర్ పైకి మాత్రం తీసుకు వెళ్లలేదు.
ఆయన ఆరోగ్యం మెల్లగా కుదుట పడుతుంది అంటూ జీవిత పేర్కొన్నారు. ఆమె మాటలను బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లో రాజశేఖర్ పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి బయటకు వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ ఆరోగ్యం కుదుట పడాలంటూ అభిమానులు మరియు సినీ వర్గాల వారు ప్రార్థనలు చేస్తున్నారు.
141554 791680So may be the green tea i buy in cans the same as the regular tea youd buy to put in your morning cup? Ive been told is just normal green tea produced to be cooler, but does it have any affect as far as not speeding up your metabolism as quickly as normal hot green tea? 985214
922050 953198Hey there, Can I copy this post image and implement it on my personal internet log? 115795