Switch to English

ఇన్ సైడ్ స్టోరీ: ఆ ముగ్గురికీ సీరియస్ వార్నింగిచ్చిన జగన్..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత పార్టీలో ఎవరంటే అందరూ చెప్పే మాట సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అనే…కానీ ఈ ముగ్గురిలో నెంబర్ టూ అని ఎవరంటే ఎవరికి వారేనన్న సమాధానం వస్తుంది. దీంతో ఈ నెంబర్ టూ విషయంలో పార్టీలో ఉన్న గ్రూప్ వార్, జగన్ కు చికాకులు తెప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎదురుపడినపుడు ఆ ముగ్గురూ ఆలింగనాలు చేసుకుని ఆవాజ్ దో హమ్ ఏక్ హై వంటి నినాదాలిచ్చినా కాసేపటికే ఎవరికి వారే యమునా తీరేనన్నది పార్టీలో అంతర్గతంగా వినిపించే మాట.

ఇలాంటి పరిస్థితుల్లో మొన్నీమధ్య వైజాగ్ ఎల్జీపాలిమర్స్ లో ప్రమాదం సంభవించిన సమయంలో తన కారు నుండి సాయిరెడ్డిని జగన్ దింపేసిన ఘటన పార్టీలోనూ, బయటా పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యమంత్రి జగన్ దగ్గర సాయిరెడ్డి హవా తగ్గిపోయిందన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ తనకు డ్యామేజ్ జరుగుతుందని గ్రహించిన సాయిరెడ్డి నష్టనివారణకు శతవిధాలా ప్రయత్నించి ఓమాదిరిగా బయటపడ్డారు. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదనీ, ప్రాణం పోయేంతవరకూ పార్టీలోనే, జగన్ తోనే ఉంటానని కూడా మీడియాముఖంగా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే జరిగిన ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన సాయిరెడ్డి, అసలా వీడియో బయటకు రావటానికి కారణాలను అన్వేషించిన మీదట ఉద్దేశ్యపూర్వకంగానే ఆ ఎపిసోడ్ జరిగిందన్న అభిప్రాయానికి వచ్చారట. తనతోపాటు నెంబర్ టూ రేసులో ఉన్న ఆ ఇద్దరి నేతల్లో ఒకరు ఇదంతా చేయించారనీ, సీఎంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఇందుకు సహకరించారని సాయిరెడ్డి బలంగా నమ్మారు. దీంతో మళ్లీ గ్రూప్ వార్ తెరపైకి వచ్చింది. ఓ ప్రముఖ ఛానెల్ ద్వారా సదరు నేత తనను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారనీ, కాబట్టి తనపై తెరవెనుక జరుగుతుందన్న తతంగంపై సీరియస్ గా దృష్టిపెట్టాలని సీఎం జగన్ కు సాయిరెడ్డి మొరపెట్టుకున్నట్లు వినికిడి.

అయితే విషయం తెలుసుకున్న సదరు ముఖ్యనేత కూడా అలాంటిదేం లేదు, తెరవెనుక కుట్రలు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. పైగా సాయిరెడ్డి వైపు నుండి జరుగుతున్న కొన్ని పరిణామాలపై జగన్ కు రివర్స్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పాలనాపరంగా ఎదురవుతున్న సమస్యలు, రాజకీయవిమర్శలపై ఉమ్మడిగా పోరాడాల్సిన తరుణంలో ఇలా గ్రూపులు కట్టడంపై చిరాగ్గా ఉన్న జగన్, ఈ ముగ్గురు నేతల్ని పిలిచి కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలిసింది.

151 సీట్లు వచ్చినంత మాత్రాన రిలాక్సవటం మంచి పద్ధతి కాదనీ, ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని పార్టీలో గ్రూపులున్నాయన్న ఫీలర్స్ బయటకు పంపటం మంచిది కాదని నేతలకు చెప్పినట్లు సమాచారం. ఒకరి పరిధిలో మరొకరు వేలు పెట్టకుండా ఎవరికి వారికి బాధ్యతలు కూడా కట్టబెట్టినట్లు తెలిసింది.

రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు బాధ్యుడిగా సజ్జల రామకృష్ణారెడ్డినీ, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు బాధ్యుడిగా వైవీ సుబ్బారెడ్డినీ, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల బాధ్యతలను సాయిరెడ్డి ని చూడమని స్పష్టం చేసిన జగన్ మిగతా విషయాల్లో వేలుపెట్టొద్దని సదరు నేతలకు గట్టిగానే సూచించారట. ఇలా జిల్లాలవారీ బాధ్యతల్ని గతంలోనే అప్పగించినప్పటికీ వాటిని వదిలేసి అంతర్గతపోరుపై దృష్టిపెట్టటం ఎవ్వరికీ మంచిది కాదనీ, ఇదే లాస్ట్ వార్నింగని చెప్పటంతో సదరు ముగ్గురు నేతలు మొఖాలు చూసుకుని మారు మాట్లాడకుండా తలూపి వచ్చేశారట. మరి పార్టీ బలాన్ని నేతల బలహీనతలు దెబ్బతీస్తే నష్టపోయేది జగనే కదా..ఏమంటారు..?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...