ప్రజారాజ్యం పార్టీ అధినేత.. తిరుపతి ఎమ్మెల్యే.. రాజ్యసభ సభ్యుడు.. కేంద్ర మంత్రి.. ఇవేవీ ఇవ్వనంత ‘కిక్’, ‘మెగాస్టార్’ అన్న ఇమేజ్ చిరంజీవికే కాదు, ఆయన అభిమానులకీ ఇస్తుందన్నది నిర్వివాదాంశం. ఆ విషయం అర్థం చేసుకున్నారు గనుకనే, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, సినీ పరిశ్రమలోకి మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చేసి.. ‘అందరివాడు’ అన్పించుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. నిజమే, రాజకీయాల్లోకి వస్తే ‘కొందరివాడు’ అయిపోవాల్సిందే. ఆ అనుభవమే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా ఎదురవుతోంది.
ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించాలనుకున్నారో.. ఆ తర్వాత ఒక్కసారిగా ఈక్వేషన్స్ మారిపోయాయి. విమర్శించేవాళ్ళు ఎప్పుడూ వుంటారు. కానీ, ‘పవన్ కళ్యాణ్ రైట్ డెసిషన్ తీసుకున్నారు..’ అనే చర్చ మేధావి వర్గంలో జరుగుతోంది. పైగా, పార్టీని నడపడం కోసం.. తన కుటుంబాన్ని నడపడం కోసం సినిమాలు తప్ప ఇంకో మార్గం లేదని పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణతో ఒక్కసారిగా పవన్ ఇమేజ్ వంద రెట్లు పెరిగింది.
ఓ వైపు ఒప్పుకున్న సినిమాల్లో నటించేందుకోసం టైమ్ కేటాయిస్తుండడం, ఇంకో వైపు పార్టీ కార్యక్రమాల కోసం సమయాన్ని వెచ్చిస్తుండడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. జనసైనికుల్లో అయితే తమ అధినేత పట్ల గౌరవం అమాంతం వెయ్యి రెట్లు పెరిగిందిప్పుడు. గౌరవం మాత్రమే కాదు, ఆరాధనాభావం మరింత పెరుగుతోంది. ‘అప్పుడలా అన్నావ్, ఇప్పుడెందుకు సినిమాలు చేస్తున్నావ్.?’ అని విమర్శించినోళ్ళు కూడా, ‘ఆయనేమీ దొంగతనం చేయట్లేదు.. దోచుకోవట్లేదు.. కాంట్రాక్టులు చేయట్లేదు..’ అని పవన్ నిర్ణయాన్ని సమర్థిస్తుండడం గమనార్హం.
‘పార్టీ నుంచి పోయినోళ్ళను పట్టించుకోను.. ఎవర్నో నమ్ముకుని పార్టీ పెట్టలేదు..’ అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. పొలిటికల్ ఈక్వేషన్ పరంగా చూసుకుంటే, సినిమాల్లో నటించేందుకు పవన్ గ్రీన్ స్నిగల్ ఇచ్చాక, అంతకు ముందు.. అని మాట్లాడుకోవాలి. నో డౌట్, పవన్ పాపులారిటీ పది రెట్లు పెరిగింది.. సినిమాటిక్ గ్లామర్ కాదు.. పొలిటికల్ గ్లామర్ ఇది.
334674 462631I dont normally have a look at these types of websites (Im a pretty modest person) – but even though I was a bit shocked as I was reading, I was certainly a bit excited as nicely. Thanks for creating my day 892220
261601 572697camping have been the best activity that we can have during the summer, i really like to roast marshmallows on a campfire` 27310
652437 8315I like this internet blog very considerably so a lot superb information . 853216