చరిత్రను వక్రీకరించారనీ, తొలుత బయోపిక్ అని చెప్పి.. ఇప్పుడు కల్పితమని చెప్పడంలో ఆంతర్యమేమంటనీ ఆరోపిస్తూ, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాని అడ్డుకునేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హైకోర్టు ఈ మేరకు, వారి పిటిషన్‌ని కొట్టి పారేసింది. ‘మహాత్మాగాంధీ చరిత్ర అయినా.. వాస్తవాలతోపాటు, కల్పితాలు కూడా వుంటాయి.. సినిమాని వినోదంగా మాత్రమే చూడాలి..’ అంటూ హైకోర్టు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పెద్ద సినిమాల విషయంలో కొందరి డైరెక్షన్ మేరకు కేతిరెడ్డి అనే వ్యక్తి నానా యాగీ చేస్తుండడం తెలిసిన విషయమే. అయితే, ఆయనకు హైకోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది. ‘ఈ దశలో సినిమా విడుదలను అడ్డుకోలేం.. సినిమాలో ఏది వాస్తవమో, ఏది కల్పితమో ప్రజలే తేల్చుకుంటారు..’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి సంబంధించి చాలా వివాదాలు తెరపైకొచ్చాయి. సినిమా రిలీజ్‌ని అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఆ ప్రయత్నాలు ఒక్కొక్కటీ బెడిసికొడుతూ వచ్చాయి.
తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కిన విషయం విదితమే. బయోపిక్ అయినా.. చివరికి అది ‘కల్పితం’ అనే డిక్లరేషన్ ఇస్తుంటారు. సో, ‘సైరా నరసింహారెడ్డి’ అసలు కథేనా.? కల్పితమా.? అన్నదానిపై సందేహాలు అప్రస్తుతమిక్కడ. ‘ఉయ్యాలవాడ’ వారసుల పేరుతో కొందరి యాగీ, సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ ఇంకో యాగీ.. వెరసి, అవన్నీ అటకెక్కాయిప్పుడు.
అత్యంత భారీ స్థాయిలో ‘సైరా నరసింహారెడ్డి’ కొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరంజీవి, అమితాబ్‌బచ్చన్, నయనతార, తమన్నా తదిరులు నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ని సురేందర్‌రెడ్డి తెరకెక్కించగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
699638 743762Hi there. Extremely cool site!! Guy .. Beautiful .. Great .. I will bookmark your site and take the feeds additionallyI am glad to locate so much valuable information right here inside the post. Thanks for sharing 913333
512985 297170Methods for dilution antimicrobial susceptibility beadlets for beagles that grow aerobically-fifth edition. 133028
263785 853360Its genuinely a nice and beneficial piece of info. Im glad which you just shared this helpful information with us. Please maintain us informed like this. Thanks for sharing. 313877